టి20లో అత్యుత్తమ ప్లేయర్ల గురించి చెప్పిన గిల్‌క్రిస్ట్.. ఇండియాలో ఎవరంటే..?

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ t20 వరల్డ్ కప్ ముందు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు.టి20 ఫార్మేట్ లో ఈ ఐదు మంది ఆటగాళ్లు అత్యుత్తమ ఆటగాళ్లని పేర్కొన్నారు.

హార్దిక్ పాండ్యా 2022లో అత్యుత్తమ ఫామ్ కనబర్చుతున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా టీ20ల్లో బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను మంచి ప్రదర్శనను కనబరుస్తున్న ఈ అత్యుత్తమ ఆల్ రౌండర్ పై పలువురు మాజీ ప్లేయర్లు ప్రశంసల వరకు వర్షం కురిపిస్తున్నారు.ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వార్నర్ ఒంటి చేత్తో విజయాలందించగల సామర్థ్యం కలిగి ఉన్నాడు.ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు అందుబాటులో లేనప్పటికీ వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌కు మళ్లీ జట్టులోకి వచ్చి అద్భుతమైన ఫామ్ తో బ్యాటింగ్ చేస్తున్నాడు.

ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ నెంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు.ఇతని దెబ్బకు ప్రత్యర్థి జట్ల వికెట్లు పడగొట్టి, మ్యాచ్ స్వరూపమే మార్చే గల సామర్థ్యం ఉన్న ఆటగాడు.

Advertisement

ప్రసుత కాలంలో బ్యాటింగ్ చేయడంలోనూ రషీద్ ఖాన్ ప్రమాదకరంగా కనిపిస్తున్నారు.క్రీజ్ లో కుదురుకుంటే మాత్రం బౌండరీ లా వర్షం కురిపించే సత్తా గల ఆటగాడిలా కనిపిస్తున్నాడు.

ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ఇంగ్లాండ్ T20 కెప్టెన్ జోస్ బట్లర్ t20 ఫార్మేట్లో అతను ఎంత ప్రమాదకరమైన ఆటగాడు చెప్పాల్సిన పని లేదు.ఇటీవల పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ ఆడిన 7 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు గాయంతో దూరమైన బట్లర్ t20 ప్రపంచకప్ ఆడేందుకు రానున్నాడు.ఐపీఎల్లో ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు చేసి ఈ ఏడాది తాను ఎంతటి ప్రమాదకర బ్యాటరో ప్రపంచానికి చూపించాడు.పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ప్రస్తుతం టీ20ల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా బాబర్ ఆజామ్ పేరు సంపాదించాడు.టీ20 ఫార్మాట్లో బాబర్‌కు మంచి పేరు ఉన్నా కానీ, కెప్టెన్సీ విషయంలో మాత్రం అతని పై చాలా విమర్శలు కూడా వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు