నెయ్యిలో ఇవి క‌లిపి రాస్తే..వృద్ధాప్య ఛాయ‌లు దూరం?

వ‌య‌సు పెరిగే కొద్ది వృద్ధాప్య ఛాయ‌లు క‌నిపించ‌డం స‌ర్వ సాధార‌ణం.ముఖ్యంగా నాల‌బై ఏళ్లు వ‌చ్చాయంటే చాలు.

య‌వ్వ‌నం త‌గ్గి చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు ఏర్ప‌డుతుంటాయి.అయితే వ‌య‌సును ఎలాగో త‌గ్గించుకోలేము.

కానీ, కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే వృద్ధాప్య ఛాయ‌లను దాచేసి.నాల‌బై లోనూ ఇర‌వై ఏళ్ల మాదిరిగా క‌నిపించ‌ వ‌చ్చు.

అందుకు నెయ్యి అద్భుతంగా స‌హాయ‌ ప‌డుతుంది.వంట‌ల‌కు నెయ్యి ఎంత మంచి రుచిని అందిస్తుందో అంత‌ కంటే ఎక్కువే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Advertisement

అలాగే చ‌ర్మ సంరక్ష‌ణ‌లోనూ నెయ్యి ఉప‌యోగ‌ ప‌డుతుంది.మ‌రి నెయ్యిని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసు కుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల నెయ్యి, అర‌ స్పూన్ గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి, మెడ‌కు మ‌రియు చేతుల‌కు అప్లై చేసి కాసేపు మ‌సాజ్ చేసుకోవాలి.

డ్రై అయిన త‌ర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకుని ట‌వ‌ల్‌తో తుడుచు కోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే వృద్ధాప్య ఛాయ‌లు దూర‌మై.

చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరుస్తుంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

అలాగే మూడు స్పూన్ల నెయ్యిలో ఒక స్పూన్ బాదం నూనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ర్మానికి అప్లై చేసి.ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

Advertisement

బాగా ఆరిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేసినా ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు త‌గ్గి.

చ‌ర్మం య‌వ్వ‌నంగా మారుతుంది.ఈ టిప్స్ పాటించ‌డంతో పాటు ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో స్పూన్ నెయ్యి తీసుకోవాలి.

నెయ్యితో పాటు డైట్‌లో తృణ ధాన్యాలు, పాలు, బీన్స్, వాల్ న‌ట్స్‌, వేరు శెన‌గ‌లు, గ్రీన్ టీ, జామ ప‌ళ్లు, బొప్పాయి, కివి పండు వంటివి చేర్చుకోవాలి.ఎందుకంటే ఈ ఆహారాలు వృద్ధాప్య ఛాయ‌లను నివారించ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

ఇక వాట‌ర్ ఎక్కువ‌గా తీసుకోవ‌డంతో పాటు కంటి నిండా నిద్ర పోవాలి.లేదంటే ఎన్ని చేసినా ఫ‌లితం ఉండ‌దు.

తాజా వార్తలు