టాటూ వలన ఈ ఘోరమైన ప్రమాదం రావొచ్చు

టాటూ .పచ్చబొట్టుకి ఒక అధునాతనమైన పేరు.

కాని పచ్చబోటు వేసే పద్ధతులే మారిపోయాయి.ఇప్పుడున్న ఫ్యాషన్ మైండెడ్ ట్రెండ్ లో టాటూ వేయించుకోవడం అనేది ఒక ఫ్యాషన్ స్టెట్‌మెంట్ అయిపోయింది.

Getting Tattoo With Organic Colors Can Cause Skin Cancer – Study-Getting T

ఆడ, మగ తేడా లేకుండా, ఎక్కడపడితే అక్కడ టాటూ వేయించుకుంటున్నారు.అనారోగ్యకరమైన పద్దతిలో టాటూ వలన యువత ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.

యూరోపియన్ కమిషన్ యొక్క జాయింట్ రీసెర్చి సెంటర్ అందించిన రిపోర్టు ప్రకారం టాటూలు వేయించుకునే వారిలో 5% మందికి బ్యాక్టీరియల్ ఇంఫెక్షన్స్ వచ్చి, స్కిన్ క్యాన్సర్ బారిన ప్రమాదం ఉందట.ఇప్పుడు వేస్తన్న టాటూల్లో ఆర్గానిక్ కలర్స్, కలర్డ్ ఇంక్ వాడుతున్నారు.

Advertisement

ఇవి ఇంజెక్ట్ చేయడం వలన ఆజో-పిగ్మెంట్స్ చర్మలోకి చేరుతాయి.ఇలాంటి కండిషన్లో చర్మం యూవి రేస్ ఎదుట నిలిచినప్పుడు రకరకాల చర్మ సమస్యలతో పాటు స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరిగిపోతుందట.

ఇక ఈ టాటూలను వదిలించుకోవాలన్నా ప్రమాదమే అంట.లేజర్ థెరపి ద్వారా టాటూ వదిలించుకోవాలని ప్రయత్నిస్తే స్కిన్ పిగ్మెంటేషన్ డిజార్డర్స్ వచ్చే ప్రమాదం 15% పెరిగిపోతుందని చెబుతున్నార పరిశోధకులు.కాబట్టి టాటూలు వేయించుకునే ముందు కాస్త ముందు వెనుక అలోచించాల్సిందే.

టాటూ ఇంజెక్ట్ చేస్తున్నప్పుడు అందులో ఎలాంటి రసాయనాలను వాడుతున్నారో తెలుసుకోవాలి.

Prasadam concrete mixers : ప్రసాదం తయారు చేస్తున్న ప్రోక్లైన్లు కాంక్రీట్ మిక్సర్లు ఎక్కడంటే..
Advertisement

తాజా వార్తలు