ప్రపంచంలో మనుషులు చాలా రకాలుగా ఉంటారు.కొంత మంది మరీ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు.
వాళ్ళు చేసే పనులతో అందరి దృష్టిని ఆకర్షించిన అవి కాస్తా పిచ్చి పనులుగా ఉంటాయి.అయినా ఎవడి పిచ్చి వాడికి ఆనందం అనే విధంగా అలాంటి వాటిని ప్రజలు కూడా చూసి ఆస్వాదిస్తూ ఉంటారు.
విదేశాలలో ఇలాంటి పిచ్చోళ్ళు ఎక్కువగా కనిపిస్తారు.వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం సమాజం, చుట్టూ ఉన్న జనంతో సంబంధం లేకుండా నచ్చినట్లు బ్రతుకుతారు.
అలా బ్రతికే క్రమంలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు.ఇప్పుడు అలాంటి వ్యక్తే ఒకరు ఒంటినిండా టాటూలు వేసుకుంటూ డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో పాటు చివరికి తన చెవులని కూడా తీసేసి ఏకంగా భద్రపరుచుకున్నాడు.
జెర్మనీకి చెందిన సాండ్రో అనే వ్యక్తి టాటూ ప్రియుడు.తన శరీరంపై రకరకాలుగా పచ్చబొట్టు వేయించుకున్నా కూడా ఇంకా సంతృప్తి కలగలేదు.దీంతో బొమ్మతో ఆడుకున్నట్టుగా శరీరాన్ని నచ్చిన రీతిలో మలుచుకోవడం మొదలుపెట్టాడు.శరీరాన్ని ఓ ఎముకల గూడులా, నుదురుపై ఎముకలు తేలేలా కనిపించడం, తలపై స్పైక్స్ పెట్టించుకోవడం, చేతిపై చర్మాన్ని డిజైన్ మేరకు తీసేయడం, నాలుకను రెండుగా చీల్చడం.ఇలా 17 సార్లు బాడీ మాడిఫికేషన్స్ చేయించుకున్నాడు.2019లో ఏకంగా చెవులు కత్తిరించుకొని వాటిని ఓ జాడీలో భ్రదపరిచాడు.దానికి సంబంధించిన వీడియోను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.అతనికి పిచ్చి పట్టిందని అంటున్నవారు అతని చేష్టలని చూసి మిస్టర్ స్కల్ ఫేస్ అని అయితే ఎవరెన్ని విమర్శలు చేసిన, భయపడి తనకు నచ్చినట్లే తాను ఉంటానని ఆ వ్యక్తి చెప్పడం విశేషం
.