ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో ఎంతపెద్ద సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే.ఆయన పై మొదటి నుంచి నెలకొన్న అనేక సందేహాలకు ఆయన మొన్న క్లారిటీ ఇచ్చేశారు.
ఆయన తన పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.
అయితే అప్పటి నుంచి ఆయన హుజూరాబాద్‌లోనే మకాం వేశారు.
ఇంకోవైపు టీఆర్ఎస్ కూడా ఈటలను ఒంటరి చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది.
హరీశ్‌రావు నేతృత్వంలో ఈటల వర్గీయులను తమవైపు తిప్పుకుంటోంది టీఆర్ ఎ స్.దీంతో ఈటల కూడా తన ప్లాన్‌లో తాను ఉన్నారు.తన వర్గాన్ని కాపాడుకునేందుకు నియోజకవర్గంలోనే ఉంటూ భరోసా ఇస్తున్నారు.దీంతో చాలామంది ఆయనకు జై కొడుతున్నారు.ఇప్పటికే చాలామంది టీఆర్ఎస్‌ను వీడి ఈటల వెంట నడుస్తామని ప్రకటించారు.

ఇదే క్రమంలో ఉప ఎన్నికకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు ఈటల.ఇందులో భాగంగా ఆయన కొన్ని ఊర్లళ్లో పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.రేపు కమలాపూర్, శంభుని పల్లి, కానిపర్తి గ్రామాల్లో పర్యటించి, ఆ గ్రామాల ప్రజలతో మాట్లాడనున్నారు.
కమలాపూర్‌లో ఆయన వర్గీయులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లాగేసుకుంటున్నారని ఈటలకు తెలియడంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.అక్కడి కార్యకర్తలతో రేపు ఆయన మాట్లాడి వారిలో దైర్యం నింపనున్నారు.

ఉప ఎన్నికల్లో పోటీచేస్తే గ్రామాల్లో ఆయనపై సానుభూతిపెరిగేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు.ముందునుంచే మద్దతు కూడగట్టి ఎలాగైనా గెలవాలని ఆలోచిస్తున్నారు.ఏయే ఊర్లల్లో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందో ఆ ఊర్లను ఆయన పరిశీలించి సానుభూతిని పెంచుకోవాలని చూస్తున్నారు.దాంతో పాటు తనను వీడుతున్న వారిని కలిసి తనవెంట నడిచేలా చూసుకోవాలని భావిస్తున్నారు.
చూడాలి మరి ఈటల ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.