గౌతమ్( Gautham )గట్టమనేని పరిచయం అవసరం లేని పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )కుమారుడిగా ఎంతో గుర్తింపు పొందినటువంటి గౌతమ్ ఇన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా చలాకిగా ఉంటున్నారు.గత కొద్దిరోజుల క్రితం మహేష్ బాబు ఫౌండేషన్ తో అనుసంధానమైనటువంటి హాస్పిటల్ కి వెళ్లి తమ ఫౌండేషన్ ద్వారా సర్జరీలు చేయించుకున్నటువంటి చిన్నారులను కలిసి వారితో ఎంతో సమయం కేటాయించి సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఆగస్టు 31వ తేదీ గౌతమ్ తన 17వ పుట్టినరోజు( Birthday )వేడుకలను జరుపుకున్నారు.అయితే ఈ పుట్టినరోజు తమకు ఎంతో ప్రత్యేకమైన తన తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్టులు కూడా వైరల్ అయ్యాయి .ఇలా గౌతమ్ 17వ పుట్టినరోజు సందర్భంగా తన సొంత గ్రామం బుర్రపాలెం వెళ్లి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గౌతమ్ బుర్రపాలెంలో సేవా కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఫోటోలు వీడియోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఇందులో భాగంగా మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పిల్లల కోసం స్పోర్ట్స్ కిట్ అందచేయడమే కాకుండా వినికిడి లోపంతో బాధపడే వారికి హియరింగ్ మిషన్స్ అందజేస్తూ తన మంచి మనసు చాటుకున్నారు.అదేవిధంగా చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేయడమే కాకుండా వారికి కానుకలు కూడా అందజేస్తూ అందరి కళ్ళల్లో ఆనందం చూశారు.
ఇలా ఎంతో డబ్బున్నటువంటి వారు తమ పుట్టినరోజు వేడుకలను విదేశాలలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఇలా పుట్టిన రోజుల కోసం లక్షల్లో ఖర్చు చేస్తుంటారు కానీ మహేష్ బాబు పిల్లలు మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధమని చెప్పాలి.
వీరి పుట్టినరోజు ఎంతో ప్రత్యేకంగా ఉండాలన్న ఉద్దేశంతో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఇలా గౌతమ్ తన పుట్టినరోజు వేడుకలను పిల్లల సమక్షంలో ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి ఫోటోలు వీడియోలపై నేటిజన్స్ స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
నమ్రత తన పిల్లలను చాలా గొప్పగా పెంచారు అంటూ పలువురు కామెంట్స్ చేయగా.అసలు ఏం ఫ్యామిలీ రా బాబు మీది మరి అందరి పట్ల ఇంత జాలి ఏంటి అంటూ వీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇకపోతే గతంలో సితార( Sitara )పుట్టినరోజు సందర్భంగా కూడా సితార మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం కాకుండా పాఠశాలకు నడుస్తూ వెళుతున్నటువంటి చిన్నారుల కోసం ఏకంగా సైకిళ్లను కోనించి వారితో కలిసి తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.తాజాగా గౌతమ్ కూడా అదే విధంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడంతో ఈ చిన్నారుల మంచి మనసుపై నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తూ దేవుడు వీరికి అంతా మంచే చేయాలని ఆశీర్వదిస్తున్నారు.







