టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు పవర్ స్టార్.
ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన డై హార్ట్ ఫ్యాన్స్ గురించి మనందరికీ తెలిసిందే.
ముఖ్యంగా పవర్ స్టార్ సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది.

ఇకపోతే రేపు అనగా సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో బిజీ బిజీగా ఉన్నారు.ఈ సందర్భంగా ఆయన అభిమానులు వారం రోజుల ముందు నుంచే వేడుకలను ప్రారంభించారు.పలు సేవా కార్యక్రమాలు, బ్లడ్ క్యాంప్ లు నిర్వహిస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో వైరల్ గా మారింది.పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు 470 కేజీల వెండి చైన్లతో పవర్ స్టార్ ఫేస్ ఆర్ట్ ను రూపొందించారు.
సిల్వర్ చైన్స్ ( Silver chains )తో పవన్ కళ్యాణ్ రూపాన్ని తీర్చిదిద్దడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఆ వీడియో పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే ఇది కదా పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంటే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇకపోతే రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ నటించిన గుడుంబా శంకర్ ( Gudumba Shankar )సినిమాను రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని నాలుగైదు థియేటర్లలో పలు షోలు ఫిక్స్ అయ్యాయి.ఆ రోజు రచ్చ చేసేందుకు ఫ్యాన్స్ ప్రిపేర్ అవుతున్నారు.అలాగే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్లు కూడా విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.







