గౌతమ్ సవాంగ్ బదిలీపై రాజకీయంగా విమర్శలు చేసిన సీపీఐ నేత నారాయణ

గౌతమ్ సవాంగ్ బదిలీపై రాజకీయంగా విమర్శలు వస్తున్నాయి.ఆయన్ని ఎందుకు బదిలీ చేశారని జనసేనాని పవన్ ప్రశ్నించారు.

తాజాగా సీపీఐ కూడా స్పందించింది.గౌతమ్ సవాంగ్ కి తగిన శాస్తి జరిగిందన్నారు సీపీఐ నేత నారాయణ.

ఒక ఉన్నత స్థాయిలో వున్న అధికారులు పాలక వర్గం ఏం చెబితే అది చేయాలని భావిస్తే ఇలాంటివే జరుగుతాయన్నారు.గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ కి ఎంత మంచి చేశారో తెలుసు.

అలాగే పీవీ రమేష్ లాంటివారిని అలాగే చేశారన్నారు.నిజాయితీగా పనిచేసేవారి పట్ల ప్రభుత్వం గతంలో ఇలాగే వ్యవహరించింది.

Advertisement

తప్పుల మీద తప్పులు చేసి, విధేయత చూపించిన వారిని బదిలీ చేయడంతో అధికారులకు కను విప్పు కావాలన్నారు.ఒకసారి తప్పులు చేయడం మొదలెడితే ఒక మంచి పని చేసినా ఇలాగే జరుగుతుంది.

మీ బాధ్యత మీరు చేయండి.మేం చేయలేమని భావిస్తే పక్కకు జరగాలన్నారు నారాయణ.

Advertisement

తాజా వార్తలు