హైడ్రోపోనిక్స్ గార్డెనింగ్ సిస్టమ్ తో గార్డెనింగ్ ఈజీ..!

గార్డెనింగ్( Gardening ) అంటే ఎంతో ఇష్టం ఉండి, గార్డెనింగ్ సంరక్షణ చూసుకునే తీరికలేని వారు చాలానే ఉన్నారు.

గతంలో గార్డెనింగ్ అంటే రోజులో కొంత సమయం వాటి సంరక్షణకు కేటాయించాల్సి వచ్చేది.

కానీ టెక్నాలజీ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన క్రమంలో హైడ్రోపోనిక్స్ గార్డెనింగ్ సిస్టమ్( Hydroponics gardening system ) తో గార్డెనింగ్ చాలా ఈజీ.తరచూ బిజీగా ఉండే వాళ్లు గార్డెనింగ్ చేయాలనుకుంటే ఈ డివైజ్ చక్కగా ఉపయోగపడుతుంది.

ఈ హైడ్రోపోనిక్స్ గార్డెనింగ్ సిస్టం ద్వారా ఆకుకూరలైన పాలకూర, బచ్చలి కూర( Lettuce, Spinach ) లాంటి వాటితో పాటు టమోటా, కొత్తిమీర, గులాబీ, చామంతి లాంటి ఇష్టమైన మొక్కలను పెంచుకోవచ్చు.ఈ డివైస్ లో త్రీ లైట్ సెట్టింగ్ అమర్చబడి ఉంటుంది.ముందుగా రెడ్ కలర్ లైట్ ను విత్తనాలు వేసేటప్పుడు, బ్లూ లైట్ ను మొక్క ఎదుగుతున్నప్పుడు, ఇక సన్ లైక్ లైట్లు పువ్వులు విరబూస్తున్నప్పుడు లేదా పండ్లు కాస్తున్నప్పుడు సెట్ చేసుకోవాలి.

ఇక గార్డెనింగ్ సంరక్షణలో నీళ్లు ఏ మోతాదులో ఉన్నాయి, ఎంత కాలం వరకు సరిపోతాయో కనిపిస్తుంటాయి.ఈ డివైస్ లో ఉండే మొక్కలకు నీటిని అందించడం కోసం ఒక ప్రత్యేకమైన హోల్ ఉంటుంది.అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి న్యూట్రిన్ టాబ్లెట్స్ వేస్తూ ఉండాలి.

Advertisement

ఈ డివైస్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే.ఇందులో మొక్కలు బయట మొక్కలతో పోలిస్తే ఐదు రెట్లు వేగంగా పెరుగుతాయి.

ఈ డివైస్ లో సైలెంట్ పంప్ తో కూడిన వాటర్ ట్యాంక్ ఉంటుంది.న్యూట్రియంట్ సొల్యూషన్స్, 24 సీడ్లీంగ్ బ్లాక్స్, 12 ప్లాంటింగ్ బాస్కెట్స్ ఉంటాయి.

ఈ డివైస్ లోపల నీటి పంపు ప్రతి గంటకు 30 నిమిషాల పాటు ఆటోమేటిగ్ గా ఆన్ అవుతూ ఉంటుంది.కాబట్టి ఈ డివైస్ ను తరచూ చెక్ చేసి సరిగ్గా సంరక్షించాల్సిన అవసరం ప్రత్యేకంగా ఉండదు.

ఈ డివైజ్ ధర 69 డాలర్లు.మన భారత కరెన్సీలో రూ.5661/- .

ప్రభాస్ ను లైన్ లో పెడుతున్న్న స్టార్ డైరెక్టర్స్...వర్కౌట్ అవుతుందా..?
Advertisement

తాజా వార్తలు