డాక్ట‌ర్లు, పోలీసులు, కార్మికులతో కరోనా గణపతి!

వినాయకచవితి వస్తుంది అంటే చాలు ప్రస్తుతం ట్రెండ్ ఏది నడుస్తుంది అనేది తెలుసుకొని మరి దానికి తగ్గట్టు విగ్రహాలను చేస్తుంటారు.

ఇంకా ఈ నేపథ్యంలోనే ఒక వినాయక చవితికి రోబో బొమ్మని పెట్టగా.

మరో వినాయక చవితికి బాహుబలి బొమ్మను పెట్టారు.ఇంకా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే కరోనా వైరస్ గణపతిని పెట్టేశారు.

గత 8 నెలలుగా కరోనా వైరస్ ప్రపంచాన్ని ఓ ఆట ఆడేసుకుంటుంది.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కారణంగా వినాయకుడి వేడుకలు ఘనంగా జరగడం లేదు.

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇంట్లోనే వినాయక చవితిని ఘనంగా చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే చెన్నైకి చెందిన నందిని విఘ్నేష్ అనే ఓ మ‌హిళ త‌న ఇంటిని క‌రోనా వైర‌స్ నేపథ్యంలో గ‌ణేష్‌‌ విగ్రహాలను పెట్టింది.

Advertisement

అసలు అంతగా ఏముందు అంటే.ఆమె పెట్టిన గణేష్ చేతిలో ఫేస్‌మాస్క్, శానిటైజర్ పెట్టి వ్యక్తిగత పరిశుభ్రత సందేశాన్ని తెలియ‌జేస్తుంది.

ఇంకా అలానే అక్కడ ఎలుక కూడా ఫేస్ మాస్క్ ధరించింది.మరో వేదికపై ఉన్న విగ్రహం చేతులలో ఒక చెయ్యిలో పోలీస్ లు, మరో చెయ్యిలో వైద్యులు, మరో చెయ్యిలో ఫ్రంట్‌లైన్ కార్మికులు ఉన్నారని ఈ విగ్రహంలో కనిపిస్తాయి.

కోవిడ్ సమయంలో వారు ఎంత శ్రమించారో ఈ వీడియోలో తెలుస్తుంది.

జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?
Advertisement

తాజా వార్తలు