గేమ్ ఛేంజర్ చరణ్ పాత్రకు స్పూర్తి ఆ కలెక్టర్ అని తెలుసా.. ఆ వ్యక్తి ఎవరంటే?

రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్( Game changer ).

ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

తమిళ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అయింది.ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించడంతో ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.

విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడిన విషయం తెలిసిందే.అయితే సినిమా ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఉంది అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై రివ్యూలను తెలుపుతున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ క్యారెక్టర్( IAS character ) లో నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమాలో ఐఏఎస్ క్యారెక్టర్ కి ఒక గొప్ప వ్యక్తి స్ఫూర్తి అని తెలుస్తోంది.

Advertisement

చరణ్ పాత్రకు ఆ కలెక్టర్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈ పాత్రను డిజైన్ చేశారట.ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అన్న విషయానికి వస్తే.తమిళనాడు కేడర్‌ కు చెందిన పని బకాసురుడు అని పిలిచే అధికారి నుండి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారట.

ఆయన భారత ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పెద్ద పెద్ద రాకకీయ నాయకులను గడగడలాడించారు.సినిమాలో రామ్ చరణ్ మూడు లుక్ లలో అదరగొట్టినట్లు టాక్.

ఒకటి కాలేజ్ లో లుక్, రెండు ఐఏఎస్ అధికారిగా, మూడు తండ్రి పాత్రల్లో అప్పనగా నటించాడు.ప్రస్తుతం అప్పన్న పాత్రకి మంచి మార్కులు పడుతున్నాయి.

అయితే ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారిగా నటించిన పాత్రకు రియల్ లైఫ్ ఐఏఎస్ అధికారి ఇన్స్పిరేషన్.రైటర్ కార్తీక్ ( Writer Karthik )ఈ పాత్రను తమిళనాడు కేడర్ కు చెందిన పని బకాసురుడు అని పిలిచే ఐఏఎస్ అధికారి TN శేషన్‌ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్నారట.శేషన్‌ చాలా అరుదైన గొప్ప ప్రభుత్వ అధికారి.

నాని రెండు సినిమాలతో హిట్ కొడతాడా..?
డాకు మహారాజ్ ప్రమోషన్స్ విషయంలో అసంతృప్తిలో అభిమానులు.. రికార్డులు క్రియేటవుతాయా?

తిరునెల్లై నారాయణ అయ్యర్‌ శేషన్‌.టిఎన్‌ శేషన్‌ ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేని పేరు.

Advertisement

కానీ 90వ దశకంలో దేశ రాజకీయాల్లో ఇదొక సంచలనమైన పేరు.ఆయన భారత ఎన్నికల అధికారిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో పెద్ద పెద్ద రాజకీయ నాయకులను గడగడలాడించారట.

ఆయన భారత ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలకు ఆద్యం అయ్యారట.కేవలం ఎన్నికల సంఘంలోనే కాకుండా పని చేసిన ప్రతి శాఖల్లోనూ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రజా, పర్యావరణ ప్రాజెక్టులను అడ్డుకున్నారట.

దీంతో ఆయన చుట్టూ అనేక కేసులు, వివాదాలు తిరిగాయట.

తాజా వార్తలు