రామ్ చరణ్ దవడ అంటే చాలా ఇష్టం.. గేమ్ ఛేంజర్ ఎడిటర్ కామెంట్స్ వైరల్!

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన చిత్రం గేమ్ చేంజర్.

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా మేనియానే కనిపిస్తోంది.

ఈ సినిమా జనవరి 10న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీబిజీగా ఉన్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాకు సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా గేమ్ చేంజర్ మూవీ( game changer movie ) ఎడిటర్ రూబెన్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గేమ్ చేంజర్ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించాడు.ఒక్కో పాత్రకు ఒక్కోలా నటించాల్సి ఉంటుంది.అన్ని కారెక్టర్లను అద్భుతంగా పోషించాడు అంటూ రామ్ చరణ్ పర్ఫామెన్స్ గురించి రూబెన్ గొప్పగా చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక పర్ఫామెన్స్ గురించి కంటే రామ్ చరణ్ ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్, ముఖ కవలికల గురించి మాట్లాడాడు.రామ్ చరణ్ చూడటానికి గ్రీక్ గాడ్‌ లా ఉంటాడని, వారికి ఉండే ఫీచర్స్ ఉన్నాయి.

రామ్ చరణ్ జాలైన్ (దవడ) బాగుంటుందని, అది నాకు చాలా ఇష్టమని రూబెన్ చెప్పుకొచ్చాడు.ఒక డిక్షనరీలా ఆయన ఉంటాడు అంటూ రూబెన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తూ మూవీపై అంచనాలను భారీగా పెంచేస్తున్నారు డైరెక్టర్ శంకర్.ఇప్పటికే ఈ సినిమా నుంచి నాలుగు పాటలతో పాటు టీజర్, పోస్టర్లు కూడా విడుదలైన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఈ సినిమా పాటలు సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్ లో రికార్డుల మోత మోగిస్తున్నాయి.

ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ( pree release event )ను జనవరి 4వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవితో పాటు సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నట్టు తెలుస్తోంది.

2025 సంవత్సరంలో మనవడు కావాలని కోరిన సురేఖ.. చరణ్ శుభవార్త చెబుతారా?
Advertisement

తాజా వార్తలు