మందు బాబులకు బంపర్ ఆఫర్.. మద్యం బాటిల్‌కి గుడ్డు, గ్లాస్, వాటర్ ప్యాకెట్ ఫ్రీ..

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం పాలసీ ప్రవేశ పెట్టిన అనంతరం మందుబాబులు పార్టీలు చేసుకుంటూ అనడంతో రెచ్చి పోతున్నారు.సరళమైన ధరలు, బ్రాండెడ్ మద్యం లభ్యతతో, వారు కొత్త పాలసీని పెద్దగా ఆదరించి 75 రోజుల్లో రూ.6,312 కోట్ల మద్యం కొనుగోలుచేసారు.ఈ కొత్త పాలసీ చాల మందికి బాగా నచ్చింది.

 Bumper Offer For Drug Addicts.. Free Egg, Glass, Water Packet For Every Bottle O-TeluguStop.com

తక్కువ ధరలతో మంచి మద్యం అందిస్తూ ఉండడంతో మందుబాబుల అభిరుచులకు సరిపోతుంది.అయితే ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకారం, అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకూ 75 రోజుల్లో 83,74,116 కేసుల లిక్కర్, 26,78,547 కేసుల బీర్లు అమ్ముడయ్యాయని వెల్లడించింది.

Telugu Bumper, Drug Addicts, Egg, Glass, Liquor Bottle, Packet, Packetbottle-Lat

ఇది ఇలా ఉండగా ఈ న్యూఇయర్ సందర్భంగా మద్యం వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.ఎందుకంటే పార్టీలు, సెలబ్రేషన్లు జరుగుతాయనే అంచనాతో సేల్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది.న్యూ ఇయర్ సందర్భంగా, చాలాచోట్ల మద్యం షాపులు రకరకాల ఆఫర్లను ప్రకటించాయి.అయితే, అన్నమయ్య జిల్లాలో ఉన్న ఒక వైన్ షాపు వైరల్ అయింది.రాజంపేటలో ఉన్న ఈ షాపు అదిరిపోయే ఆఫర్ను ప్రకటించింది.వారు ప్రకటించిన ఆఫర్ ప్రకారం, ప్రతి మద్యం బాటిల్ కు ఒక గుడ్డు, గ్లాస్, వాటర్ ప్యాకెట్ ఫ్రీ ఇచ్చే విషయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

ఈ బోర్డు చూసిన మందుబాబులు “సూపర్ ఆఫర్” అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.బాటిళ్లకు బాటిళ్లు కొనడం మొదలెట్టారు.

ఈ విధంగా సరికొత్త ఆఫర్లు, మందుబాబులని మరింత ఆకట్టుకుంటున్నాయి.ఇది ఇలా ఉంటె మందుబాబులు కట్టడి చేసేందుకు పోలీసులు కూడా రంగంలోకి దిగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube