ఎక్కడో మిమిక్రీ ఆర్టిస్ట్ గా పని చేస్తూ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సుడిగాలి సుదీర్ కు జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం వచ్చింది.ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పరిచయమైనటువంటి సుడిగాలి సుదీర్ తన టాలెంట్ తో అంచలంచెలుగా ఇండస్ట్రీలో ఎదుగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు.
ఇక ఇండస్ట్రీలో బుల్లితెర మెగాస్టార్ గా సుడిగాలి సుదీర్ కు ఎంతో మంచి పేరు ఉంది.ఇలా బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న ఈయనకు క్రమంగా సినిమా అవకాశాలు రావడం కూడా మొదలయ్యాయి.
మొదట్లో పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు సుధీర్.
ఇలా తన మొదటి సినిమాలో సక్సెస్ కాకపోయినా ఏమాత్రం నిరాశ చెందకుండా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ క్రమంలోనే తాజాగా రాజశేఖర్ రెడ్డి పులి చెర్ల దర్శకత్వంలో ఆయన నిర్మాణంలోనే సుధీర్ హీరోగా నిర్మించిన చిత్రం గాలోడు.ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి మంచి లాభాలను కూడా అందుకుంది.

ఇలా గాలోడు సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ సొంతం చేసుకున్న సుధీర్ కెరియర్ కు ప్లస్ అయిందని చెప్పాలి.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో పలువురు దర్శక నిర్మాతల కన్ను సుధీర్ పై పడిందని తెలుస్తుంది.ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు నిర్మాతలు సుడిగాలి సుధీర్ ను సంప్రదించి ఆయనకు అడ్వాన్సులు కూడా ఇచ్చారని ఇండస్ట్రీ టాక్.
మొత్తానికి గాలోడు సినిమా సుధీర్ దశ మారిపోయేలా చేసిందని చెప్పాలి.ఇలా ఈయన సినిమా అవకాశాలు అందుకుంటూనే బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు.