హైదరాబాద్: హోటల్ దస్పల్లాలో కంభంపాటి రామ్మోహనరావు రాసిన ‘‘నేను.తెలుగుదేశం’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సభలో రాజకీయాల్లో సమాకాలీకులైన టీడీపీ అధినేత చంద్రబాబు, సీపీఐ నేత నారాయణ మధ్య సదరా సంభాషణ జరిగింది.ఈ సందర్భంగా నారాయణపై చంద్రబాబు జోకులేశారు.
నారాయణ సిద్ధాంతం కోసం పనిచేస్తే.ప్రజల ప్రయోజనాల కోసం తాము పనిచేస్తామని చంద్రబాబు అన్నారు.
‘‘నారాయణ కూడా నేను తెలుగుదేశం పుస్తకం రాయొచ్చు.
నష్టపోయిన ఏపీని పునర్‌నిర్మించేది టీడీపీనే.
ఎన్టీఆర్ శత జయంతి, మహానాడును వైభవంగా నిర్వహిస్తాం.ప్రాంతీయ పార్టీతో దేశ రాజకీయాలను వాదించింది ఎన్టీఆరే.
అధికారమే శాశ్వతం అనుకుంటే ఓడిపోయేవాడిని కాదు.హైటెక్ సిటీపై రాజశేఖర్‌రెడ్డి కూడా విమర్శలు చేశారు.
రానున్న కాలంలో నేను గురుతర బాధ్యతగా వ్యహరించాల్సిఉంది.ఎన్టీఆర్ కార్యక్రమాలను రూపకల్పన చేసిన వ్యక్తి కంభంపాటి రామ్మోహనరావే’’ అని చంద్రబాబు కొనియాడారు.