ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.వాటిని కొంతమంది మరింత తీవ్రతరం చేస్తుంటే, మరి కొంతమంది వాటికి పరిష్కారాలను కనిపెడుతూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.
సమస్యలను పరిష్కరించాలనే మంచి ఆలోచనల గల కొందరు కంపెనీలు సైతం స్థాపించి తమ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.తాజాగా ఆ కోవకి చెందిన ఒక కంపెనీని బెంగళూరు( Bengaluru )లో స్థాపించడం జరిగింది.
సన్ బర్డ్స్ పేరుతో ఉనికిలోకి వచ్చిన ఈ కంపెనీ కాలుష్యాన్ని తగ్గించాలనే ఆలోచనతో గొప్ప ప్రయత్నాలు చేస్తోంది.
నిజానికి ఇటీవల కాలంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.
దీనిని బ్యాన్ చేసినా వినియోగం మాత్రం పెరుగుతూనే ఉంది.దానికి కారణం వీటికి ప్రత్యామ్నాయంగా సురక్షితమైన వస్తువులు అధిక మొత్తంలో తయారు కాకపోవడం అని చెప్పొచ్చు.
ఇక ప్లాస్టిక్ స్ట్రాలు( Plastic straw ) కవర్ల వంటి వాటిని కొన్ని కంపెనీలు వాడటం మానేసాయి.ఈ కంపెనీలు పేపర్ స్ట్రాలు వంటి పర్యావరణహితమైన వస్తువులను వినియోగిస్తున్నాయి.
అయితే వీటితోపాటు మరొక సురక్షిత రకమైన స్ట్రాలను కొబ్బరి ఆకుల నుంచి తయారు చేయొచ్చని సజీ వర్గీస్ బెంగళూర్ క్రైస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కనుగొన్నారు.ఆ స్ట్రాలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో కంపెనీని స్థాపించారు.

మొదట చాలా చిన్న మొత్తంలో ఈ కంపెనీ స్ట్రాలు తయారు చేసింది.డిమాండ్ ఎక్కువ కావడంతో లక్షల్లో ఉత్పత్తి చేయడం మొదలు పెట్టింది.కాలక్రమేణా ఈ కంపెనీని ఏకంగా రెండు కోట్ల కొబ్బరి ఆకుల స్ట్రాలను( Coconut leaves ) తయారు చేసింది.అవన్నీ కూడా తక్కువ కాలంలోనే అమ్ముడయ్యాయి.సహజసిద్ధమైన ఈ స్ట్రాలు నన్ను పెంపొందించడంతోపాటు పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలిగించవు.అందుకే వీటిని పది దేశాలలోని కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి.

కెమికల్-ఫ్రీ కొబ్బరి ఆకులతో మల్టీ లేయర్స్‌గా ఈ స్ట్రాలని తయారు చేస్తారు.డ్రింక్స్‌లో ఇవి మూడు గంటల సేపు ఉంచిన పాడైపోవు.ఈ స్ట్రా ధర కేవలం 5 రూపాయలే.ఈ కంపెనీ స్థాపించిన తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటక నుంచి వందలాది మంది మహిళలకు ఉపాధి లభించింది.మొత్తం మీద అతని ఒక్క ఆలోచన చాలామందికి ప్రయోజనాలు చేకూరుస్తోంది.







