టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కోరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master ) తాజాగా మృతి చెందారు.ఆయన మరణంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కాగా రాకేష్ మాస్టర్ మరణాన్ని అభిమానులు కుటుంబ సభ్యులు తోటి సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు.మొన్నటి వరకు ఎంతో చలాకీగా ఉండే రాకేష్ మాస్టర్ ఇలా ఒక్కసారిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరంగా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఆయన మరణించడంతో ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో రాకేష్ మాస్టర్ శేఖర్ మాస్టర్ లకు మధ్య జరిగిన గొడవ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.ఒక పూట తిండికి ఇబ్బంది పడే సమయంలో రాకేష్ మాస్టర్ దగ్గరకు శేఖర్ మాస్టర్( Sekhar Master ) వచ్చాడట.
శేఖర్ మాస్టర్ టాలెంట్ చూసి రాకేష్ మాస్టర్ తన శిష్యుడిగా చేర్చుకున్నాడట.తన అసిస్టెంట్ గా చేసుకుని డాన్స్ కూడా నేర్పించాడట.అలా శేఖర్ మాస్టర్ లు అవకాశాలు వచ్చేలా చేశాడట.కానీ శేఖర్ స్టార్ గా ఎదిగిన తర్వాత రాకేష్ మాస్టర్ ని నిర్లక్ష్యం చేశాడనే వాదనలు గట్టిగానే వినిపించాయి.
అంతేకాకుండా ఎప్పుడూ చనువుగా ఉండే వారిద్దరి మధ్య దూరం పెరిగింది.

రాకేష్,శేఖర్ మాస్టర్ ల మధ్య గొడవలకు బీజం పడింది, చిరంజీవి నటించిన ఖైదీ 150( Khaidi 150 ) మూవీ విషయంలోనే.ఆ మూవీలో రెండు పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.ఆ విషయం శేఖర్ మాస్టర్ ,రాకేష్ మాస్టర్ కి చెప్పకుండా దాచాడట.
శేఖర్ నేను కలిసి ఎన్నో బాధలు అనుభవించాము.వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే పేరెంట్స్ ని కలిసి పిల్లను ఇవ్వమని అడిగాను, వారు సినిమా వాళ్లకు ఇవ్వము అన్నారు.
శేఖర్ కి నేను ఒకటే చెప్పాను నువ్వు, నేను వేరొకరితో అబద్ధాలు చెప్పిన పర్లేదు.మనం మాత్రం ఒకరి గురించి ఒకరు అబద్దాలు చెప్పుకోకూడదు.
ట్రాన్స్పరెంట్ గా ఉండాలని చెప్పాను.చిరంజీవి ( Chiranjeevi ) వంటి హీరో సినిమా ఛాన్స్ గురించి వాడు నాకు చెప్పలేదు.
భార్యకు చెప్పాడు, నాకు చెప్పలేదు.

వాడు చాలా ఎత్తుకు ఎదిగాడు.నేను వెతుక్కుంటూ వెళ్ళాను.నాకు వచ్చిన ఆఫర్స్ కూడా శేఖర్ కరెక్ట్ అని రిఫర్ చేశాను.
వాడు బాగుండాలనే నేను కోరుకుంటాను.అయితే వాడిని నేను ఎప్పటికీ కలవను.
నేను చనిపోతే నా శవాన్ని కూడా తాకొద్దని చెబుతాను.వాళ్ళ భార్య కూడా నన్ను శత్రువును చూసినట్లు చూస్తుంది.
నా గురించి మాట్లాడుతూ హేళనగా నవ్వాడు అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు రాకేష్ మాస్టర్.కాగా రాకేష్ మాస్టర్ ఆరోపణలకు శేఖర్ మాస్టర్ స్పందించాడు.
చిరంజీవి సినిమాకు రెండు సాంగ్స్ చేస్తానని నాకు పూర్తి స్పష్టత లేదు.కన్ఫర్మ్ అయ్యాక చెబుదామని అనుకున్నాను.
ఆయన నాకు గురువు గారు.

ఆయనకున్న వేల మంది శిష్యుల్లో నేను కూడా ఒకడిని.నాకు డాన్స్ నేర్పారు నేను ఒప్పుకుంటాను.అవకాశాల విషయంలో ఎవరి కష్టం వాళ్ళది.
నన్ను ఏరా పోరా అన్నా కూడా నేను బాధపడను.అంతకు మించి అంటే బాధేస్తుంది.
తాగి మా అమ్మను తిట్టాడు.నా భార్యకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడని రాకేష్ మాస్టర్ పై శేఖర్ మాస్టర్ ఆరోపణలు చేశాడు.
ఈ కారణాలతో శేఖర్ మాస్టర్, రాకేష్ మాస్టర్ దూరం కావడం జరిగింది.అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఈ లోకం విడిచి వెళ్లడం అన్నది బాధగా ఉంది.
మరి ఇటువంటి సమయంలో శేఖర్ మాస్టర్ అవన్నీ పక్కనపెట్టి రాకేష్ మాస్టర్ ని చూడడానికి వెళ్తారా లేదా లేకపోతే పంతాలకు పోతార అన్నది చూడాలి మరి.







