'చేప'పై కప్ప రైడ్.. వీడియో వైరల్!

ఈ మధ్యకాలంలో చేపలకు సంబంధించిన వీడియోలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

నిన్నటికి నిన్న ఓ చేప ఒడ్డుకు చేరుకొని కొట్టుమిట్టాడుతుంటే ఓ తాబేలు వచ్చి చేపను నీటిలోకి లాగి స్నేహం అంటే ఇదే అనిపించింది.

ఇప్పుడు కూడా అలాంటి ఘటన జరిగింది.అది చూస్తే నిజంగానే ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యం కలుగుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఓ చేప మీద కప్ప పడుకొని ప్రయాణిస్తుంది.గతంలో ఇలాంటిది ఎప్పుడైనా చూశారా ? ఆశ్చర్యం వేస్తుంది కదా! ఆశ్చర్యం వేసినప్పటికి ఇది నిజంగానే జరిగింది.8 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో పెద్ద తెల్ల చేప ఈత కొడుతుంది.ఆ చేప తల మీద కప్ప కూర్చుని ప్రయాణిస్తుంది.

ఈ వీడియోను తీసిన కొందరు దీన్ని ట్విట్టర్ లో షేర్ చెయ్యగా అందరిని తెగ ఆకట్టుకుంది.ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

మరికొందరు నెటిజన్లు అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది.బస్సును క్యాచ్ చేసేందుకు చేప పై కప్ప ఇలా రైడ్ చేస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.

Advertisement

తాజా వార్తలు