వామ్మో.. 2 కిలోల ఇసుక దొంగ‌త‌నం చేసినందుకు 86వేలు ఫైన్.. ఎక్క‌డంటే?

మ‌న దేశంలో ఇసుక దందాలు యథేచ్ఛగా కొనసాగుతున్నా.అధికారులు మాత్రం చూసి చూడ‌న‌ట్టు వ‌దిలేస్తుంటారు.

 A French Tourist Caught Stealing Sand From Sardinian Beach Fined Rs 86000!  Fren-TeluguStop.com

ప్ర‌భుత్వం అనుమతులు లేకుండా కొంద‌రు లక్షలాది రూపాయల ఇసుక అక్ర‌మ దందా సాగిస్తూ.సొమ్ము చేసుకుంటున్నారు.

ప్రభుత్వం ఏదైనా.ఈ ఇసుక దందాలు మాత్రం ఆగ‌డం లేదు.

ఇక అధికారులు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

తాజాగా రెండు కిలోల ఇసుక దొంగ‌త‌నం చేసినందుకు.

ఓ వ్య‌క్తికి 86వేలు ఫైన్ వేశారు.అయితే ఇది మ‌న దేశంలో అనుకుంటే పొర‌పాటే.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.ఫ్రాన్స్ కు చెందిన ఓ పర్యాటకుడు ఇటీవల మెడిటేర్రనియన్ సీమ్‌లోని అతిపెద్ద ఇటాలియన్ ఐల్యాండ్‌ సర్దేనియాకు వెళ్లాడు.

అక్క‌డ ప్ర‌కృతి అందాల‌ను మ‌న‌సారా తిల‌కిస్తూ.ఫుడ్ ఎంజాయ్ చేశాడు.

ఇక్క‌డ వ‌ర‌కు బాగానే ఉంది.

కానీ, అత‌ను చేసిన పొర‌పాటు.

తిరిగి వ‌చ్చేట‌ప్పుడు అక్క‌డి బీచ్‌లోని ఇసుక‌ను ఓ రెండు కిలోలు త‌న సంచిలో నింపుకున్నారు.అనంత‌రం ఎల్మాస్ ఎయిర్పోర్టుకు వెళ్లగా.

అక్కడి అధికారుల త‌నిఖీల్లో ఇసుక బ‌య‌ట‌ప‌డింది.దీంతో అత‌డికి ఏకంగా వెయ్యి యూరోలు ఫైన్ విధించి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు.

వెయ్యి యూరోలు అంటే మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో దాదాపు 86 వేలు అన్న‌మాట‌.

ఊహించ‌‌ని షాక్ తిన్న స‌ద‌రు ప‌ర్య‌ట‌కుడు రెండు కిలోల ఇసుక తీసుకెళ్తే ఇంత జరిమానా విధిస్తారా? అని అధికారుల‌ను ప్ర‌శ్నించ‌గా.సర్దేనియా ప్రాంతంలోని బీచ్‌ల్లోని ఇసుక దొంగ‌త‌నం చేయ‌డం అక్క‌డ చట్టరీత్యా నేరం అని అధికారులు తేల్చిచెప్పారు.అంతేకాదు, ఇలా ఇసుక దొంగ‌త‌నం చేస్తే.ఇక్క‌డ జైలు శిక్ష విధిస్తార‌ని స్ప‌ష్టం చేశారు.దీంతో స‌ద‌రు ప‌ర్య‌ట‌కుడు చేసేదేమి లేక‌.

చివ‌ర‌కు ఫైన్ క‌ట్టి సారీ చెప్పాడు.ఏదేమైనా ఇలాంటి క‌ఠిన చ‌ర్య‌లు అన్ని దేశాల్లోనూ ఉంటే భ‌లేగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube