ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం..కలెక్టర్ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఉత్తర్వులు..!

ఇంటర్ చదివిన ఓ యువకుడు జల్సాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బు సంపాదించడం కోసం నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.

ఏకంగా జిల్లా కలెక్టర్ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఉత్తర్వుల పత్రాలు అందించి ఆ నిరుద్యోగులను దారుణంగా మోసం చేశాడు.

అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.

యాదాద్రి జిల్లా( Yadadri Bhuvanagiri ) మోటకొండూరు మండలం వర్టూరు గ్రామానికి చెందిన ఆలేటీ నవీన్ అనే యువకుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు.జల్సాల బారిన పడి చెడు వ్యసనాలను అలవాటు చేసుకున్నాడు.

ఇక కష్టపడకుండా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలని, అడ్డదారిలో వెళితేనే కావలసినంత డబ్బు సంపాదించవచ్చని భావించాడు.ప్రభుత్వ శాఖలలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించాడు.

Advertisement

భువనగిరి పట్టణంలోని సంజీవ్ నగర్ లో నివాసం ఉండే మహిళ రాజమణి ద్వారా 11 మంది నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు.

ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి( Vinay Krishna Reddy ), జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీల సంతకలను ఫోర్జరీ చేసి స్టాంపులు తయారు చేసి వివిధ శాఖలకు సంబంధించిన నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లను నిరుద్యోగ బాధితులకు ఇచ్చాడు.ఎప్పుడు ఉద్యోగంలో చేరాలో తాను చెబుతానని అంతవరకు వేచి ఉండాలని వారికి సూచించాడు.బాధితులు ఎప్పుడు అడిగినా రేపు మాపుఅంటూ దాటవేశాడు.

ఇక బాధితులు విస్తుపోయి ఆరా తీయగా అవి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ల పత్రాలు అని తెలిసింది.తాము ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ చేయగా.బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించేలా ఒక బాండ్ పేపర్ రాసించాడు కానీ డబ్బులు చెల్లించలేదు.

బాధితులు భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా నవీన్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి రిమాండ్ కు తరలించారు.

ఆరెంజ్ తొక్కలతో అదిరిపోయే ఫేస్ సీరం.. రోజు వాడితే సూపర్ బెనిఫిట్స్ మీ సొంతం!
Advertisement

తాజా వార్తలు