హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఫ్రాన్స్ బిలియ‌నీర్ మృతి.. !

ఫ్రాన్స్ బిలియ‌నీర్, డ‌సాల్ట్ విమాన సంస్థ కుటుంబీకుల్లో ఒక‌రు అయినా ఒలివ‌ర్ డ‌సాల్ట్ ఆదివారం జ‌రిగిన హెలికాప్ట‌ర్‌ ప్ర‌మాదంలో చ‌నిపోయారు.

కాగా ఈ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో ఒలివ‌ర్‌తో పాటు పైల‌ట్ కూడా ప్రాణాలు కోల్పోయారట.

ఇక ఫ్రాన్స్‌లో ఒలివ‌ర్ డ‌సాల్ట్ కుటుంబం అత్యంత సంప‌న్న కుటుంబం.అదీగాక డ‌సాల్ట్ విమాన సంస్థ‌ను ఏర్పాటు చేసిన మార్సెల్ డ‌సాల్ట్ మ‌న‌వ‌డే ఒలివ‌ర్ డ‌సాల్ట్‌.

ఇతను మంచి అనుభం ఉన్న రాజ‌కీయ‌వేత్త కూడా.ఇక ఒలివ‌ర్ డ‌సాల్ట్ మృతి ప‌ట్ల పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఎమ్మాన్యువ‌ల్ మాక్ర‌న్ మాట్లాడుతూ, నిరంత‌రం దేశ సేవ‌లో నిమ‌గ్న‌మైన కెప్టెన్ ఇక లేర‌ని దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.వైమానిక ప‌రిశ్ర‌మ‌లో ఒలివ‌ర్ డ‌సాల్డ్ ఓ కెప్టెన్ లాంటి వార‌ని, జీవితాంతం ఆయ‌న దేశ సేవ‌కే అంకిత‌మ‌య్యార‌ని, ఒలివ‌ర్ మృతి దేశానికి తీర‌ని లోటు అని పేర్కొన్నారు.

Advertisement

ఇదిలా ఉండగా ఒలివ‌ర్ డ‌సాల్ట్ ప్రయాణిస్తున్న హెలికాప్ట‌ర్‌ నార్త‌ర్న్ ఫ్రాన్స్‌లోని డ్యూవిల్లీలో కూలిన‌ట్లు ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.

పుష్ప 2 లో శ్రీ వల్లి ని చంపేది ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు