బాలినేనితో అద్దంకి వైసీపీ మాజీ ఇంఛార్జ్ కృష్ణచైతన్య భేటీ..!!

ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్( Former Minister Balineni Srinivas ) తో అద్దంకి వైసీపీ మాజీ ఇంఛార్జ్ కృష్ణచైతన్య సమావేశం అయ్యారు.

ఈ మేరకు ఇరువురు సుమారు అరగంట పాటు భేటీ అయ్యారని తెలుస్తోంది.

అయితే ఇటీవలే కృష్ణచైతన్యను నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.అలాగే అద్దంకి వైసీపీ సీటును హనిమిరెడ్డికి కేటాయించింది.

ఈ క్రమంలో వైసీపీ( YCP ) టికెట్ ను హనిమిరెడ్డికి కేటాయించడంపై కృష్ణ చైతన్యతో పాటు ఆయన అనుచర వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.ఈ క్రమంలోనే కృష్ణచైతన్య టీడీపీ గూటికి వెళ్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు బుధవారం కృష్ణచైతన్య( Krishna Chaitanya )కు సంబంధించిన క్వారీల్లో మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలోకి వెళ్తారనే నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

Advertisement

అయితే తాజాగా బాలినేనితో కృష్ణచైతన్య సుమారు అరగంట పాటు సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు