ప్రజా 'రాష్ర్టపతి' ఇక లేరు

మిస్సైల్‌ మేన్గా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన శాస్ర్తవేత్త, భారత మాజీ రాష్ర్టపతి అబ్దుల్‌ కలాం ఇకలేరు.

ప్రజా రాష్ర్టపతిగా పేరు పొందిన సున్నిత మనస్కుడు, ఉన్నత సంస్కారం గల నాయకుడు సోమవారం సాయంత్రం మేఘాలయాలో కన్నుమూశారు.

షిల్లాంగ్‌ ఐఐటీలో సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ప్రసంగిస్తుండగానే కలాం కుప్పకూలిపోయారు.తీవ్రమైన గుండెపోటు కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు చెప్పారు.

ఎనభై మూడు సంవత్సరాల కలాం దేశానికి పదకొండో రాష్ర్టపతిగా సేవలందించారు, ఈ వార్త తెలియగానే దేశం శోకసంద్రంలో మునిగిపోయింది.ప్రధానంగా యువతకు అబ్దుల్‌ కలాం గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

కలాం మాదిరిగా యువతను ఉత్తేజపరిచిన మరో నాయకుడు కనబడరు.కలలు కనండి.

Advertisement

వాటిని సాకారం చేసుకోండి అనేది ఆయన గొప్ప కొటేషన్‌.కలాం గౌరవార్ధం ప్రభుత్వం ఏడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు