Koneru Konappa : బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఫైర్..!!

తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప( Koneru Konappa ) మండిపడుతున్నారు.గత ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం( Sirpur Assembly constituency )లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) తో పోటీ పడిన కోనప్ప ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

 Former Mla Konappa Fires On Brs Bsp Alliance-TeluguStop.com

గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను తీవ్రంగా దూషించిన వ్యక్తిని పార్టీ అధిష్టానం పొత్తు పెట్టుకోవడంపై కోనప్ప తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దీంతో కోనప్పను బీఆర్ఎస్ బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది.ఇందులో భాగంగానే మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) కోనప్పకు ఫోన్ చేసి సముదాయించారు.మరోవైపు కోనప్ప తన అనుచరులు, అభిమానులతో హైదరాబాద్ లో సమావేశం కానున్నారు.

ఇందులో భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో కోనప్ప చర్చించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube