Koneru Konappa : బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఫైర్..!!

తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప( Koneru Konappa ) మండిపడుతున్నారు.

గత ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం( Sirpur Assembly Constituency )లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) తో పోటీ పడిన కోనప్ప ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

"""/" / గత ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను తీవ్రంగా దూషించిన వ్యక్తిని పార్టీ అధిష్టానం పొత్తు పెట్టుకోవడంపై కోనప్ప తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో కోనప్పను బీఆర్ఎస్ బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది.ఇందులో భాగంగానే మాజీ మంత్రి హరీశ్ రావు( Harish Rao ) కోనప్పకు ఫోన్ చేసి సముదాయించారు.

మరోవైపు కోనప్ప తన అనుచరులు, అభిమానులతో హైదరాబాద్ లో సమావేశం కానున్నారు.ఇందులో భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో కోనప్ప చర్చించనున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే12, ఆదివారం 2024