ప్రస్తుతం హిందీ సినిమా పరిశ్రమలో అశ్లీల చిత్రాల చిత్రీకరణ వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త మరియు ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తో పాటు మరింత మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
అయితే తాజాగా అశ్లీల చిత్రాల చిత్రీకరణ వ్యవహారంపై మాజీ మిస్ ఇండియా పరీ పాసవాన్ స్పందించింది.
ఇందులో భాగంగా తాను సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో అవకాశం విషయమై ఓ ప్రొడక్షన్ హౌస్ కి వెళితే అందులో కొందరు తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని వాపోయింది.
అంతేకాకుండా తాను తాగేటువంటి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చారని అది సేవించిన తర్వాత తాను మత్తు లోకి జారుకోగానే తనపై అత్యాచారం చేసి ఆ భాగోతాన్ని వీడియో కూడా తీశారని ఆ మధ్య పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా సినిమా అవకాశాల కోసం వచ్చేటువంటి నూతన నటీనటులు ఈ ప్రొడక్షన్ హౌస్ సంబంధిత వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఉపయోగించుకుంటున్నారని కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.
దీంతో బాలీవుడ్ సినిమా పరిశ్రమలో మాజీ మిస్ ఇండియా పరీ పాసవాన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

కాగా 2019 సంవత్సరంలో పరీ పాసవాన్ ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది.కానీ పెళ్లయిన కొంతకాలానికి వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో గత కొద్ది కాలంగా దూరంగా ఉంటున్నారు.కానీ ఆమధ్య పరీ పాసవాన్ భర్త నీరజ్ ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో ముంబై పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.