పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు

గుంటూరు: మార్కెట్ సెంటర్ లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, పలువురు టీడీపీ నేతలు.

మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ.

విడిపోయిన ఏపికి చంద్రబాబు సీఎంగా వ్యవహరించి అభివృద్ధి బాట పట్టించారు.జగన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్టాన్ని బ్రష్టుపట్టించారు.

ఎన్నికల ముందు రాజధాని అంశంపై ప్రజలను నమ్మించారు.రాజధాని లేని రాష్ట్రం గా ఏపిని తయారు చేశాడు.

రాజధాని కోసం 600 రోజులకు పైగా రైతులు, మహిళలు ఉద్యమం చేస్తున్నారు.ఉద్యమం చేసే వారిని జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో విధాలుగా వేదించారు.

Advertisement

ఒక రాజధాని కోసం ఇన్ని రోజులు ఉద్యమం చేయడం చరిత్ర లో ఎన్నడూ లేదు.ప్రభుత్వ ఉగ్రవాదం పేరుతో ప్రతిపక్ష పార్టీ లపై దాడులు చేస్తున్నారు.

దళితుల పైనే అట్రాసిటీ కేసులు పెట్టిన ఘనత జగన్ రెడ్డి ది.పొట్టి శ్రీరాములు స్పూర్తి తో పోరాటం చేసి జగన్ రెడ్డి ని సాగనంపుతాం.

Advertisement

తాజా వార్తలు