హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు..!

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ( Shiva Balakrishna ) అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఈ మేరకు శివబాలకృష్ణను కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు.

ఈ క్రమంలోనే శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్టు( Remand Report )లో కీలక అంశాలను పొందు పరిచారు.లే అవుట్ అనుమతుల కోసం భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయని లంచాలు తీసుకున్నారని నిర్ధారించారు.

అంతేకాదు శివ బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండీఏ, రెరాలో పలు అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలోనే బాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న తరువాత బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్నారు.

రెండేళ్ల క్రితమే శివబాలకృష్ణపై ఏసీబీ ఫిర్యాదు వచ్చిందని తెలుస్తోంది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు