పోటీపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్..!

వచ్చే ఎన్నికల్లో పోటీపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను విశాఖ నుంచి పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు.

మీడియా వారే తనను రోజుకో పార్టీలో చేర్చుతున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తాననేది కేవలం ప్రచారం మాత్రమేనని తెలిపారు.

విశాఖ రాజధాని మార్పు అనేది సుప్రీంకోర్టులో ఉందన్నారు.న్యాయస్థానంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ప్రకటనలు చేయడం సరికాదని చెప్పారు.

ఒకవేళ ఆ విధంగా చేస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొన్నారు.ఫోన్ ట్యాపింగ్ అంశంలో బాధితుడి ఆరోపణలపై న్యాయస్థానాలను, మానవ హక్కులను, పోలీసులను ఆశ్రయించవచ్చని తెలిపారు.

Advertisement

ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్ట బద్ధత ఉందన్న లక్ష్మీనారాయణ నిరాధార ఆరోపణలు పని చేయవని స్పష్టం చేశారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు