సమ్మర్ లోనూ స్కిన్ వైట్ గా బ్రైట్ గా కనిపించాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

సమ్మర్ సీజన్( Summer season ) రానే వచ్చింది.రోజురోజుకు ఎండలు బాగా ముదిరి పోతున్నాయి.

ఈ ఎండల్లో ఆరోగ్యంతో పాటు చర్మం కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది.మండే ఎండలు, అధిక వేడి కారణంగా స్కిన్ టాన్ అవడం, కలర్ తగ్గిపోవడం, డ్రై అవ్వ‌డం ఇలా రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి.

వాటికి చెక్ పెట్టి సమ్మర్ లోనూ స్కిన్ వైట్ గా బ్రైట్ గా మెరిసిపోవాలి అంటే పెద్ద సవాలే.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని కనుక పాటించారంటే చాలా సులభంగా చర్మాన్ని తెల్లగా మరియు కాంతివంతంగా మెరిపించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక చిన్న టమాటో( Tomato ) ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక అరటి పండును( Banana fruit ) కూడా తీసుకుని పీల్ తొలగించి స్లైసెస్ గా కట్ చేయాలి.ఆ త‌ర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న అరటిపండు స్లైసెస్ మరియు టమాటో ముక్కలు వేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె( honey ), వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని తడి వేళ్లతో సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని రెండు రోజులకు ఒకసారి కనుక పాటించారంటే మీ స్కిన్ కు తిరుగే ఉండదు.

ఈ రెమెడీ టాన్ ను పూర్తిగా తొలగిస్తుంది.స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.

పొరుగింటి వ్యక్తిని చెప్పుతో కొట్టిన లేడి పోలీస్... వీడియో వైరల్...
ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 

చర్మం కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే ఈ రెమెడీ చర్మాన్ని తేమగా కోమలంగా మారుస్తుంది.

Advertisement

సమ్మర్ లోనూ స్కిన్ వైట్ గా బ్రైట్ గా మెరిసిపోవాల‌ని భావించే వారికి ఈ హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి తప్పక ప్రయత్నించండి.

తాజా వార్తలు