Wedding season : ఈ పెళ్లిళ్ల సీజన్ లో సూపర్ గ్లోయింగ్ గా మెరిసి పోవాలనుకుంటున్నారు.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!

మళ్లీ పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయింది.ఎంతో మంది కొత్త జంటలు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.

పెళ్లిళ్ల సీజన్( Wedding season ) లో బ్యూటీ పార్లర్స్ అసలు ఖాళీగా ఉండవు.మన ఇంట్లో పెళ్లి అయినా, బంధువుల పెళ్లి అయినా ప్రతి ఒక్కరూ అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు.

అందులో భాగంగానే బ్యూటీ పార్లర్ కి వెళ్లి ఫేషియల్, బ్లీచ్, టాన్ రిమూవల్, పెడిక్యూర్, మానిక్యూర్ వంటివి చేయించుకుంటూ ఉంటారు.అయితే అందరూ బ్యూటీ పార్లర్ కు వెళ్లలేరు కదా.అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీని కనుక ఫాలో అయితే ఫేషియల్ కూడా అక్కర్లేదు.

అంత అందంగా, సూపర్ గ్లోయింగ్ గా మీ స్కిన్ మెరుస్తుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు టొమాటో ముక్కలు( Tomato slices ) మరియు నాలుగు నుంచి ఐదు క్యారెట్ స్లైసెస్ ( Carrot slices )వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ ములేటి పౌడర్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి.

అలాగే నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) మరియు సరిపడా టొమాటో క్యారెట్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు మరియు చేతులకు కూడా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

పెళ్లికి పది రోజుల ముందు నుంచి రెగ్యులర్ గా ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ చర్మం లో కొత్త మెరుపును గమనిస్తారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

ఈ రెమెడీ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు మరియు మురికిని పూర్తిగా తొలగిస్తుంది.చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది.ఏమైనా మొండి మొటిమలు.

Advertisement

మచ్చలు ఉంటే క్రమంగా వాటిని మాయం చేస్తుంది.అలాగే ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ సూపర్ సాఫ్ట్ గా మరియు గ్లోయింగ్ గా తయారవుతుంది.

ఈ పెళ్లిళ్ల సీజన్లో సహజంగానే అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవాలని భావించే వారికి పర్ఫెక్ట్ రెమెడీ ఇది.కాబట్టి తప్పక ట్రై చేయండి.

తాజా వార్తలు