మీ జుట్టు పొడుగ్గా దట్టంగా పెరగాలా.. అయితే ఈ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి!

సాధారణంగా అమ్మాయిలు దట్టమైన పొడవాటి జుట్టు ( long hair )కోసం ఎంతగానో ఆరాటపడుతుంటారు.

కానీ ఒత్తిడి, పోషకాల కొరత, ఆహారపు అలవాట్లు, హార్మోన్ చేంజ్, పలు రకాల మందుల వాడకం, కాలుష్యం తదితర అంశాలు కారణంగా జుట్టు పొట్టిగా పల్చగా తయారవుతుంది.

ఇటువంటి హెయిర్ ఏమాత్రం ఆకర్షణీయంగా కనిపించదు.ఈ క్రమంలోనే జుట్టును మళ్ళీ పొడుగ్గా దట్టంగా పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటించారంటే కొద్దిరోజుల్లో పొడవాటి దట్టమైన కురులు మీ సొంతం అవుతాయి.

మరి లేటెందుకు ఆ రెమెడీ గురించి తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ( fenugreek )మరియు ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Advertisement

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని నానబెట్టుకున్న మెంతులను వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్( Amla powder ), వన్ టేబుల్ స్పూన్ భృంగరాజ్ పౌడర్ ( Bhringraj powder )మరియు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ( curd )వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి.

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ మాస్క్ ఎంతో ఉత్తమం గా సహాయపడుతుంది.వారానికి ఒకసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టుకు చక్కని పోషణ లభిస్తుంది.హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.

వయస్సు పెరుగుతున్నా లుక్స్ విషయంలో అదుర్స్. చిరుకు మాత్రమే సాధ్యమంటూ?
పెండింగ్ పనులు తోరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జుట్టు రాలడం తగ్గుముఖం పడుతుంది.అలాగే ఈ మాస్క్ వేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

Advertisement

కురులు పొడుగ్గా దట్టంగా పెరుగుతాయి.పైగా ఈ రెమెడీ ద్వారా చుండ్రు సమస్యను సైతం వదిలించుకోవచ్చు.

తాజా వార్తలు