వింటర్ లో జలుబు వదలట్లేదా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

ప్రస్తుత వింటర్ సీజన్ లో( Winter ) చలిగాలి, మంచు కారణంగా పిల్లలు పెద్దలు అనే తేడా దాదాపు అందర్నీ జలుబు( Cold ) అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెడుతుంటుంది.

పైగా వింటర్ లో జలుబు పట్టుకుందంటే ఓ పట్టాన వదిలిపెట్టదు.

జలుబు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.పనిపై శ్రద్ధ పెట్టలేకపోతుంటారు.

ఈ క్రమంలోనే జలుబును ఎలాగైనా వదిలించుకోవాల‌ని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.పుదీనా( Mint ) మ‌రియు తుల‌సి( Tulsi ) క‌షాయం జ‌లుబు నుంచి చాలా వేగంగా ఉప‌శ‌మ‌నాన్ని అందిస్తుంది.

ఒక గ్లాస్ వాట‌ర్ లో ఐదు తుల‌సి ఆకులు, ఐదు పుదీనా ఆకులు, అర స్పూన్ అల్లం త‌రుము వేసి మ‌రిగిస్తే క‌షాయం రెడీ అవుతుంది.ఈ క‌షాయంలో తేనె( Honey ) క‌లిపి రోజుకు రెండుసార్లు తాగారంటే జ‌లుబు దెబ్బకు ప‌రార్ అవుతుంది.

Advertisement

ఈ క‌షాయం క‌ఫాన్ని క‌రిగించి ద‌గ్గు స‌మ‌స్య‌ను కూడా దూరం చేస్తుంది.

కొంద‌రు జ‌లుబు చేసిన‌ప్పుడు నీటిని సరిగ్గా తీసుకోరు.జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గ‌క‌పోవ‌డానికి ఇది కూడా ఒక కారణం.బాడీ హైడ్రేట్ గా ఉంటే ఎలాంటి రోగాలైనా వేగంగా నయం అవుతాయి.

కాబ‌ట్టి రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని అది కూడా కాచి చాల్చిన నీటిని తీసుకోండి.ఇది జ‌లుబు రికవరీకి ఎంతోగానో దోహదపడుతుంది.

జ‌లుబు చేసి ఊపిరాడ‌క ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడు వేడి నీటిలో యుకలిప్టస్ ఆయిల్ వేసి ఆవిరి ప‌ట్టండి.దీంతో శ్వాస మార్గం క్లియ‌ర్ అవుతుంది.జ‌లుబు కూడా త్వ‌ర‌గా త‌గ్గుముఖం ప‌డుతుంది.

పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దూకిన ప్రయాణికులు.. వేరే ట్రైన్ కింద నలిగిపోయి.. ఘోర వీడియో!
సంక్రాంతికి వస్తున్నాం ఆ మార్క్ ను టచ్ చేయడం పక్కా.. 2025 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా?

వెల్లుల్లి, శొంఠి.ఈ రెండింటి కాంబినేష‌న్ జ‌లుబు నివార‌ణ‌లో అద్భుతంగా తోడ్ప‌డుతుంది.

Advertisement

ఒక గ్లాస్ నీటిలో వ‌న్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, అర స్పూన్ శొంఠి తురుము వేసి మరిగించి ఫిల్ట‌ర్ చేసుకోండి.ఇప్పుడు ఈ వాట‌ర్ లో చిటికెడు ప‌సుపు మ‌రియు తేనె క‌లిపి తీసుకోండి.

ఈ డ్రింక్ జ‌లుబు, ద‌గ్గు, గొంత నొప్పి, గొంతు వాపు వంటి స‌మ‌స్య‌లకు స‌మ‌ర్థ‌వంతంగా చెక్ పెడుతుంది.శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు కూడా తొల‌గిపోతాయి.

తాజా వార్తలు