మీ స్కిన్ కలర్ రోజురోజుకు తగ్గిపోతుందా.. అయితే ఇవి మీరు తెలుసుకోవాల్సిందే!

సాధారణంగా ఒక్కోసారి స్కిన్ కలర్ అనేది తగ్గుతూ ఉంటుంది.దాంతో తెగ హైరానా పడిపోతుంటారు.

చర్మ రంగును పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.కానీ కలర్ ఎందుకు తగ్గుతుంది అన్నది మాత్రం ఆలోచించారు.

స్కిన్ కలర్ రోజురోజుకు తగ్గిపోతూ రావడానికి కారణాలు అనేకం.ముఖ్యంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు, ఆహార‌పు అల‌వాట్లు, ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, సౌందర్య ఉత్పత్తులను అధికంగా వాడటం, హార్మోన్ల ప్రభావం కారణంగా స్కిన్ కలర్ తగ్గుతుంది.

అలాగే వేడి వేడి నీటితో స్నానం చేయడం, కఠినంగా ఉండే సోప్స్ ను వినియోగించడం వల్ల కూడా చర్మం రంగు డౌన్ అవుతుంది.మరి తగ్గిపోతున్న కలర్ ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మొదట పోషకాహారాన్ని డైట్ లో చేర్చుకోండి.కూల్ డ్రింక్స్, డైరీ ప్రొడక్ట్స్, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి.

ఒత్తిడిని కంట్రోల్ లో ఉంచుకోండి.గోరువెచ్చని నీటిని మాత్రమే స్నానానికి ప్రిఫర్ చేయండి.

కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.

అలాగే కొన్ని హోమ్ రెమెడీస్‌ను కూడా పాటిస్తూ ఉండాలి.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్ లో ఒక ఎగ్ వైట్ మ‌రియు వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయండి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి ఇర‌వై నిమిషాల తర్వాత వాట‌ర్ తో శుభ్రంగా కడిగేయాలి.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేయడం వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.గ్లోయింగ్ గా మెరుస్తుంది.అలాగే రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.

Advertisement

ప‌దిహేను నిమిషాల తర్వాత వాట‌ర్ తో వాష్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.

తాజా వార్తలు