ఇంటి ఆవరణలో పెరటి తోటలకు( Garden ) అవసరమైనంత స్థలం ఉన్నా కూడా చాలామంది పెరటి తోటలు ఎలా సాగు చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.ఇంటి ఆవరణలో ఎంచక్కా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను మెళుకువలతో ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
పెరటి తోటలకు సూర్యరశ్మి( Sunlight ) బాగా తగిలే, మంచినీటి వసతి ఉన్న స్థలాలు అనుకూలంగా ఉంటాయి.పెరటి తోటకు కనీసం 220మీ.
స్థలం ఉంటే సరిపోతుంది.స్థలం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే మొక్కలు సాగు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
ఇక పెరటి తోటలలో మునగా, కరివేపాకు మొక్కలను ఒక మూలన నాటుకోవాలి.ఆ మొక్కల నీడ మిగతా కూరగాయ మొక్కలపై పడకుండా ఉండేటట్లు నాటుకోవాలి.మొత్తం స్థలంలో కూరగాయలు వేయకుండా తోటలో నలువైపులా నడవటానికి దారి ఏర్పాటు చేయాలి.పెంపుడు జంతువుల వల్ల పెరటి తోటకు హని జరగకుండా ఇనుపకంచెలను ఏర్పాటు చేసుకోవాలి.
ఈ కంచెకు దగ్గరగా బీర, కాకర, దొండ లాంటి తీగజాతి మొక్కలను నాటుకోవాలి.

పెరటి తోటలలో ఎక్కువ దిగుబడి ఇచ్చే జాతుల మొక్కల కన్నా ఎక్కువ కాలం నిలకడగా ఉండి దిగుబడి ఇచ్చే జాతుల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలి.నర్సరీలో( Nursery ) పెంచిన లేదంటే నారుమడిలో పెరిగిన మొక్కలను పెరటి తోటలో నాటుకోవాలి.పెరటి తోటలో మడులను ఎత్తుగా తయారు చేయడం వలన నీరు నిల్వ ఉండదు.
కలుపు( Weed ) తీయడానికి కూడా తేలికగా ఉంటుంది.సేంద్రియ మరియు ఖనిజాలు కలిసిన ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
స్థలం కాస్త అధికంగా ఉంటే కంపోస్ట్ గుంతను ఏర్పాటు చేసుకోవాలి.పెరటి తోటలలో ఏ కూరగాయలు ఎప్పుడు సాగు చేయాలో తెలుసుకుందాం.

వర్షాకాలం:
ఎర్ర దుంపలు, క్యారెట్, ముల్లంగి, తీగజాతి కూరగాయలు, టమోటా, గోరుచిక్కుడు, బఠానీ, దొండ చిక్కుడు మొదలైనవి.
శీతాకాలం:
కొత్తిమీర, బటాని, పెద్ద చిక్కుడు, వెల్లుల్లి, ఉల్లి, బీట్రూట్, ఆవాలు, మెంతులు, క్యారెట్, క్యాబేజీ, బంగాళదుంపలు మొదలైనవి.
వేసవికాలం:
తోటకూరలు, మిర్చి, సొరకాయ, దొండ, టమోటా మొదలైనవి.
పెరటి తోటల వల్ల మానసిక ఆహ్లాదం, శారీరక వ్యాయామం పొందవచ్చు.







