తెలుగు బుల్లితెర పై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన రియాలిటీ షో ఏమిటి అని అడిగితే ఎవరైనా కళ్ళుమూసుకొని చెప్పే పేరు ‘బిగ్ బాస్'( Bigg Boss ).ఉత్తరాది ప్రాంతం లో అశేష ప్రేక్షాభిమానం ని సంపాదించుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో మన తెలుగు లో వర్కౌట్ అవుతుందా లేదా అనే సందేహం తోనే విడుదల చేసారు.
కానీ మొదటి సీజన్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో, రెండవ సీజన్ , మూడవ సీజన్ అలా పెరుగుతూ ఆరు సీజన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.ప్రతీ సీజన్ కూడా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చింది.
కానీ ఆరవ సీజన్ మాత్రం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ని దక్కించుకోలేకపోయింది.దీంతో 7 వ సీజన్ ని ఎలా అయినా బ్లాక్ బస్టర్ హిట్ ని చెయ్యాలనే కసితో పాపులర్ సెలెబ్రిటీలను ఎంచుకొని ఈ రియాలిటీ షో ని ప్రారంభించబోతున్నారు.

ఇప్పటికే ఈ 7 వ సీజన్( Bigg Boss 7 Telugu ) కి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు.ఆగష్టు మూడవ వారం లో ఈ సీజన్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ మొత్తం ఖరారు అయ్యినట్టు సమాచారం.ఇంతకు ముందు ఎపిసోడ్ లాగ కాకుండా, ఈసారి మొత్తం ప్రేక్షకులకు బాగా ముఖ పరిచయం ఉన్న సెలబ్రిటీస్ ని ఎంచుకున్నారట.
వీరితో సరికొత్త టాస్కులను ఆడిస్తూ మంచి గేమ్స్ ని డిజైన్ చేశారట.అయితే మునుపటి సీజన్స్ లో లాగ కాకుండా ఈ సీజన్ లో చాలా కఠినతరమైన రూల్స్ ఉంటాయని సమాచారం.
ఇంతకు ముందు లాగ స్వేచ్ఛగా సిగెరెట్స్( Cigarettes ) కాల్చుకునే అవకాశం ఈసారి లేకుండా చేస్తున్నారట.ఒకవేళ సిగరెట్ కాలిస్తే జరిమానా రెమ్యూనరేషన్ నుండి కట్ చేస్తారట.
ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.బిగ్ బాస్ ని కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షిస్తారని, వారిలో చిన్న పిల్లలు కూడా ఉంటారని ,అలాంటి షో లో ఇలాంటి పనులు చేస్తే వాళ్ళు కచ్చితంగా ప్రభావితులు అవుతారని గతం లో కొంతమంది కేసు కూడా వేశారు.

అందుకే ఈ కఠినమైన రూల్ ని ప్రవేశపెట్టినట్టు సమాచారం.స్మోకింగ్ రూమ్( Smoking Room ) అయితే అన్నీ సీజన్స్ లో లాగానే ఈ సీజన్ లో కూడా ఉంటుందని, కానీ స్మోక్ చేసిన ప్రతీసారీ రెమ్యూనరేషన్ నుండి లక్ష రూపాయిలు కట్ అవుతాయని అంటున్నారు.మరి కంటెస్టెంట్స్ రిస్క్ చేసి స్మోక్ చేస్తారో లేదో చూడాలి, ఒకవేళ చేస్తే మాత్రం లక్ష రూపాయిలు సమర్పించుకోవాల్సిందే.ఇక పోతే ఈ సీజన్ లో పెళ్ళైన జంటలు, విడాకులు తీసుకున్న జంటలు కూడా కనిపిస్తారని టాక్ ఉంది.
అందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.







