రిపబ్లికన్ పార్టీలోని శక్తివంతమైన నేతల్లో ఒకరైన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్( Florida Governor Ron DeSantis ) .మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రైవేట్‌గా కలిసినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం డిసాంటిస్ పోటీపడిన సంగతి తెలిసిందే.ఈ ఆదివారం ట్రంప్ – డిసాంటిస్‌లు మియామిలో కలుసుకున్నట్లుగా వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్‌లు నివేదించాయి.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ స్టీవ్ విట్‌కాఫ్( Real estate investor Steve Witkoff ) వీరిద్దరి మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.ట్రంప్ షెల్ బే క్లబ్‌లో గోల్ఫ్ ఆడుతున్నప్పుడు డిసాంటిస్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే రిపబ్లికన్ నామినేషన్ కోసం పోటీ పడిన సమయంలో ట్రంప్‌పై డిసాంటిస్ తరచుగా విరుచుకుపడేవారు.ఆయనను వ్యక్తిగత సమస్యలపై పోటీ చేసే అభ్యర్ధిగా పేర్కొన్నారు.వ్యక్తిగత ప్రతీకారం నడుస్తుంటే.ఒక దేశంగా మనకు అనవసరమన్నారు.మీరు (డొనాల్డ్ ట్రంప్ ) అమెరికన్ ప్రజల కోసం, వారి సమస్యల కోసం పరిగెత్తాలి కానీ వ్యక్తిగత సమస్యల గురించి కాదంటూ డిసాంటిస్ చురకలంటించారు.పలు ఓపీనియన్ పోల్స్‌లో మంచి రేటింగ్‌ను పొందినప్పటికీ న్యూహాంప్‌షైర్ ప్రైమరీకి కొద్దిరోజుల ముందు అధ్యక్ష ఎన్నికల బరిలోంచి డిసాంటిస్ తప్పుకున్నారు.

రిపబ్లికన్ ఓటర్లలో అత్యధికులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) మద్ధతు ఇస్తున్నందున తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.ఓ వీడియో ద్వారా డిసాంటిస్ తాను అధ్యక్ష ఎన్నికల బరిలోంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.అయోవా ప్రైమరీలో రెండో స్థానంలో నిలిచిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా డిసాంటిస్ పేర్కొన్నారు.విజయానికి స్పష్టమైన మార్గం లేకుంటే, మా మద్ధతుదారులు వారి సమయాన్ని స్వచ్ఛందంగా అందించారని , వనరులను విరాళంగా ఇవ్వమని తాను అడగలేనని పేర్కొన్నారు.
అలాగే డొనాల్డ్ ట్రంప్‌కు డిసాంటిస్ మద్ధతు ఇస్తున్నట్లుగా తెలిపారు.రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా నామినేషన్ పొందిన నేపథ్యంలో డిసాంటిస్‌ను వైస్ ప్రెసిడెంట్‌గా ఏమైనా తీసుకుంటారా అన్న చర్చ అమెరికా వ్యాప్తంగా జరుగుతోంది.
ఇలాంటి వేళ ట్రంప్‌తో ఫ్లోరిడా గవర్నర్ భేటీ ఆ దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
.






