కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) పాల్గొన్న కార్యక్రమంలో ఖలిస్తాన్ మద్ధతుదారులు రెచ్చిపోయారు.ఆయన సమక్షంలోనే ‘‘ఖలిస్తాన్’’( Khalistan ) అనుకూల నినాదాలు చేశారు.
వివరాల్లోకి వెళితే.ఖల్సా డే( Khalsa Day ) వేడుకల్లో భాగంగా ఆదివారం టొరంటో నగరంలో సిక్కు మతస్తులు పరేడ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జస్టిన్ ట్రూడోతో పాటు ప్రతిపక్షనేతలు, అధికారులు, సిక్కు కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో హాజరైంది.ఈ సందర్భంగా ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతుండగా ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపించాయి.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయినప్పటికీ ట్రూడో తన ప్రసంగాన్ని కొనసాగించారు.
సిక్కుల హక్కులు, స్వేచ్ఛను తాము ఎల్లప్పుడూ రక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.భారత్-కెనడాల మధ్య విమాన రాకపోకలు పెరిగేందుకు కృషి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
వైవిధ్యం కెనడా( Canada ) బలమని.భిన్నాభిప్రాయాలు వున్నప్పటికీ దేశం బలంగా వుందని ట్రూడో పేర్కొన్నారు.
సిక్కుల విలువలే కెనడా విలువలని .దేశవ్యాప్తంగా వున్న 8 లక్షల మంది కెనడియన్ సిక్కుల వారసత్వం కోసం, మీ హక్కులు, స్వేచ్ఛను రక్షించడానికి తాము ఎల్లప్పుడూ అండగా వుంటామని జస్టిన్ ట్రూడో వెల్లడించారు.

ద్వేషం, వివక్షకు వ్యతిరేకంగా తాము ఎల్లప్పుడూ మీ కమ్యూనిటీని రక్షించుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు.గురుద్వారాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇతర ప్రార్థనా స్థలాల వద్ద మరింత భద్రతను కల్పిస్తామని ట్రూడో తెలిపారు.మీ మతాన్ని స్వేచ్ఛగా, బెదిరింపులు లేకుండా ఆచరించుకునే హక్కు మీకుందని.అది కెనడియన్ చార్టర్ ఆఫ్ రైట్స్ అండ్ ఫ్రీడమ్స్‌లో( Canadian Charter of Rights and Freedoms ) ఇవ్వబడిన ప్రాథమిక హక్కుగా ప్రధాని పేర్కొన్నారు.

కాగా.ఖలిస్తాన్ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ ( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం వుండొచ్చంటూ గతేడాది ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా పరిగణించింది.ఇప్పటికే ఇరుదేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించగా.కెనడాలోని వీసా ప్రాసెసింగ్ కేంద్రాన్ని భారత్ మూసివేసింది.ఆ తర్వాత పౌర సమాజం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వీసా ప్రాసెసింగ్‌ను పునరుద్ధరించింది.
ప్రస్తుతం ఇరుదేశాల మధ్య రాజీ కుదిర్చేందుకు అంతర్జాతీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.







