శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద నీట మునిగిన జంక్షన్.. రాకపోకలకు అంతరాయం

రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డులో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 వద్ద వరద నీరు భారీగా నిలిచింది.వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

భారీ వర్షాలతో పెద్ద గోల్కొండ రోడ్డు చెరువును తలపిస్తోంది.దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

Advertisement
ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?

తాజా వార్తలు