నిరుపేదల బాగోగులు పట్టించుకునే ప్రభుత్వం తమదని ఏపీ సీఎం జగన్‌మోహర్ రెడ్డి తెలిపారు.గురువారం ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో రైతుల పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.అలాగే చంద్రబాబు చేసిన దత్తపుత్రుడి వ్యాఖ్యలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.‘గత పాలకులు ప్రజలకు చేసిందేమి లేదు.
ఇచ్చిన వాగ్ధానాలు మరిచి పాలన చేశారు.కానీ మా ప్రభుత్వం అలాంటిది కాదు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దాదాపుగా అన్ని పూర్తి చేశాం.మా ప్రభుత్వ హయాంలో ఎవరికీ అన్యాయం చేయలేదు.
రాష్ట్రంలో మూడు రాజధానుల వల్ల మంచి జరుగుతోందని, అందుకే ప్రతిపాదనను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం.దీనిపై కొందరు చెప్పుడు మాటలు విని దారుణంగా ప్రవర్తిస్తున్నారు.వీధి రౌడీల కంటే దారుణంగా బూతులు మాట్లాడుతున్నారు.’ అని తెలిపారు.
‘చంద్రబాబు తన దత్తపుత్రుడితో ఏం మాట్లాడిస్తున్నారో అందరం చూస్తున్నాం.మా ప్రభుత్వం మూడు రాజధానుల వల్ల మేలు జరుగుతుందని చెబితే.
దానికి వాళ్లు.కాదు మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెబుతున్నారు.
వాళ్లు చెప్పుకుంటున్నట్లు టీవీల్లో ప్రచారం చేస్తున్నారు.ఇలా చేస్తే మన అక్కా చెల్లెమ్మల జీవితాలు ఏం అవ్వాలి.

ఇలాంటి వాళ్లనా మనం నాయకులు అని చెప్పుకునేది.ఇలాంటి నాయకులను ఎన్నుకోవడం వల్ల సరైన దిశానిర్దేశం చేయగలరా?.దీనిపై ప్రజలు ఒక్కసారి ఆలోచించండి.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.‘రాష్ట్రంలో కూటమి ఏర్పడి ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తారట.జగన్‌ను వ్యతిరేకించడానికి ఇంత మంది ఏకం కావాలి.
ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.కళ్లు, కుతంత్రాలతో ప్రవర్తిస్తున్నారు.
ఇలాంటి వాళ్లను నమ్ముకుంటే రాష్ట్ర అభివృద్ధే జరగదు.సామాజిక న్యాయాన్ని మరిచి, సమాజాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటి మోసాలు భవిష్యత్‌లో ఇంకా కనిపిస్తాయి.వాటిని చూసి ప్రజలు మోసపోవద్దు.
’ అని తెలిపారు.







