శ్రీశైలం డ్యామ్ కు పెరుగుతున్న వరద నీరు..!

నల్లగొండ జిల్లా:ఎగువనకర్ణాటక,మహారాష్ట్ర( Karnataka, Maharashtra )లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది.ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టును దాటుకుని బిరబిరామంటూ జూరాలకు పరుగులు తీస్తున్నది.

జూరాల ప్రాజెక్టు 17 స్పిల్‌వే గేట్లను అధికారులు తెరిచారు.శనివారం సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో 90,800 క్యూసెక్కులు,అవుట్‌ఫ్లో 1,04,416 క్యూసెక్కులుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.జూరాల పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలకుగాను 7.645 టీఎంసీలకు చేరింది.తుంగభద్ర డ్యాం 68 టీఎంసీలకు చేరింది.

ఇన్‌ఫ్లో 1,02,744 క్యూసెక్కులు,అవుట్‌ఫ్లో 1,527 క్యూసెక్కులుగా నమోదైంది.శ్రీశైలం ప్రాజెక్టుకు 29 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది.

విద్యుదుత్పత్తి ద్వారా దిగువన నాగార్జున సాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు.కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాల కార‌ణంగా ఆల్మ‌ట్టి, నారాయ‌ణ‌పూర్ డ్యామ్ ల‌ నుంచి జూరాల ప్రాజెక్టు( Jurala Project )కు కృష్ణ‌మ్మ త‌ర‌లి వ‌స్తోంది.

Advertisement

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ప‌రిధిలో ఉన్న ఇందిరా ప్రియ‌ద‌ర్శిని జూరాల ప్రాజెక్టుకు 90800 క్యూసెక్కుల వ‌ర‌ద‌ నీరు వ‌స్తోంది.దీంతో జూరాల ప్రాజెక్టు అధికారులు 17 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వ‌దులుతున్నారు.

విద్యుత్ ఉత్పత్తికి సరిపడే నీటితో పాటు,నెట్టెంపాడు,భీమా లిఫ్ట్‌కు నీరు విడుద‌ల చేస్తున్నారు.విద్యుత్ ఉత్పాద‌న‌కు 33084 క్యూసెక్కుల నీరు విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

అలాగే, నెట్టెంపాడుకు 1,500 క్యూసెక్కులు,భీమా లిఫ్ట్‌కు 1300 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువ ద్వారా 870 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాల్వ ద్వారా 467 క్యూసెక్కులు మొత్తం ఔట్‌ఫ్లో లక్ష క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 6.202 టీఎంసీలు కాగా శనివారం రాత్రి 9 గంటల వరకు 3.938 టీఎంసీల నీరు ఉంది.శ్రీశైలం జలాశయాని( Srisailam Dam )కి వరద నీరుపెరుగుతున్నది.

ఇన్ ఫ్లో: 57,171క్యూసెక్కులు.ఔట్ ఫ్లో:నిల్,పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు ప్రస్తుతం: 811.50 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు ప్రస్తుతం:35.1774 టీఎంసీలు కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రలలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి.నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో: నిల్,ఔట్ ఫ్లో:9,874 క్యూసెక్కులు,పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు.ప్రస్తుత నీటి మట్టం 504.50 అడుగులు.పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.5050 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ: 122.5225 టీఎంసీలుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలను వదలని వర్షం
Advertisement

Latest Nalgonda News