కుక్కల దాడిలో ఐదు గొర్రెపొట్టేళ్లు మృతి,మరో ఐదు పొట్టేళ్ళకు తీవ్రగాయాలు...!

యాదాద్రి భువనగిరి జిల్లా: వీధి కుక్కల దాడిలో ఐదు గొర్రె పొట్టేలు మృతి చెందిన ఘటన మోత్కూర్ మండల పరిధిలోని దాచారం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.

సోమవారం మండల పరిధిలోని దాచారం గ్రామానికి చెందిన జాల అశోక్,అండెం పిచ్చిరెడ్డి సాయంత్రం వరకు గొర్లను మేపుకొచ్చి దొడ్లో తోలారు.అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో గోడ దూకి వచ్చిన కుక్కల మంద గొర్ల మందపై విరుచుకు పడిండి.

గొర్ల కాపర్లు వెళ్లి చూసేసరికి కుక్కల మంద దాడి చేస్తుంది.అప్పటికే ఐదు గొర్రెలు మృతి చెందగా మరో ఐదు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.

దాడికి పాల్పడిన కుక్కలను తరిమే ప్రయత్నంలో ఒక కుక్కను చంపగా,మిగిలిన కుక్కల మంద అక్కడ నుండి తప్పించుకుంది.కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండడంతో గొర్ల పెంపకందారులు,వృద్ధులు, చిన్నపిల్లలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు.

Advertisement

తక్షణమే కుక్కల నివారణకు చర్యలు తీసుకొని, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?
Advertisement

Latest Latest News - Telugu News