విశ్వనాథన్ ఆనంద్ బర్త్‌డే స్పెషల్.. చెస్ కింగ్ గురించి 5 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్!

భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్, మాజీ వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ నేడు 53 వసంతంలోకి అడుగు పెట్టారు.

డిసెంబర్ 11న జన్మించిన విశ్వనాథన్ ఆనంద్ 1988లో భారతదేశం నుంచి మొదటి గ్రాండ్‌మాస్టర్ అయ్యారు.

అతను ఎలో రేటింగ్ 2800ని అధిగమించిన అతికొద్ది మంది ఆటగాళ్లలో ఒకరిగా నిలిచి రికార్డు సృష్టించారు.అతను 2006లో ఈ ఘనతను సాధించాడు.

ఆనంద్ తన జనరేషన్‌లో అత్యుత్తమ ర్యాపిడ్ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నారు.ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

1.విశ్వనాథన్ ఆనంద్ తల్లి కూడా చెస్ ప్లేయరే!

విశ్వనాథన్ ఆనంద్ డిసెంబర్ 11, 1969లో తమిళనాడులోని మైలాడుతురైలో జన్మించారు.

అతని తండ్రి విశ్వనాథన్ అయ్యర్ సదరన్ రైల్వేస్‌లో రిటైర్డ్ హెడ్.అతని తల్లి సుశీల ఒక చెస్ ప్లేయర్.అతనికి ఒక అన్నయ్య, ఒక అక్క ఉన్నారు.

Advertisement

2.చదువుకుంది ఎంత అంటే

ఆనంద్ చెస్ ఆడుతూనే చదువుకున్నారు.అతను చెన్నైలోని డాన్ బాస్కో మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో స్కూలింగ్ పూర్తి చేశారు.అదే నగరంలోని లయోలా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.

3.యంగెస్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్!

14 ఏళ్లు ఉన్నప్పుడే ఆనంద్ 1983లో నేషనల్ సబ్-జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలిచారు.

ఆ తర్వాత సంవత్సరంలో అతను ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్‌ను కూడా గెలిచారు.దాంతో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా చరిత్ర సృష్టించారు.

4.వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయుడు

2000లో ఫైనల్ మ్యాచ్‌లో అలెక్సీ షిరోవ్‌ను ఓడించిన తర్వాత ఆనంద్ మొదటిసారిగా FIDE వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నారు.అలానే టెహ్రాన్‌లో నిర్వహించిన గేమ్‌లో టైటిల్ సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్‌గా తొలి ఇండియన్‌గా రికార్డు క్రియేట్ చేశారు.

5.అవార్డ్స్

భారతదేశానికే గర్వకారణంగా నిలిచిన ఆనంద్‌కు 18 ఏళ్ల వయస్సులోనే ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ అవార్డు లభించింది.2007లో పద్మవిభూషణ్ అవార్డు కూడా వరించింది.అతను 1991-92లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును కూడా అందుకున్నారు.

పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు