బ్యాగులో కుక్కను చూసి జిగేల్ మన్న అధికారి..ఎయిర్ పొర్టులో అందరూ షాక్

ప్రపంచంలో ఎక్కడ ఏ ఆశ్చర్యకర సంఘటన జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అని ఇట్టే తెలిసిపోతూ ఉంటుంది.నెట్టింట అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.

 Dog Found In Passangers Luggage Bag At Wisconsin Airport Details, Dog, Bag, Vira-TeluguStop.com

అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేవి ఉంటే మరికొన్ని అసహ్యాన్ని కలిగించేవి కూడా ఉంటాయి.తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాలోని ఓ ఎయిర్ పోర్టులో ఈ సంఘటన జరిగింది.ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు కూడా అవాక్కవ్వడం ఖాయం.

విమానంలోని లగేజ్ ని లోడ్ చేసే ముందు అక్కడి సిబ్బంది చెక్ చేస్తూ ఉంటారు.అలా ఓ ప్రయాణికుడు తీసుకొచ్చిన లగేజ్ బ్యాగ్ ను అధికారులు స్కాన్ చేశారు.

బ్యాగులో ఏముందో చూసి ఆశ్చర్యపోయారు.

విస్కాన్‌సిన్‌ నగరంలోని డేన్‌ కంట్రీ రీజనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లో ఒక ప్రయాణికుడు అందరిలాగే లగేజీని తీసుకొచ్చి సిబ్బంది వద్ద ఉంచాడు.

దీంతో ప్రయాణికులకు సంబంధించిన లగేజీని ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది విమానంలోకి మార్చేందుకు ప్రయత్నించారు.బ్యాగులను లోడింగ్ చేస్తుండగా హఠాత్తుగా ఓ బ్యాగులో ఏదో కదులుతున్నట్లు కనిపించింది.వెంటనే అక్కడున్న సిబ్బంది ఆ లగేజ్ బ్యాగును ఎక్స్‌రే మెషీన్‌లోకి పంపించారు.

Telugu Alivedog, America, Dog Luggage Bag, Latest-Latest News - Telugu

అయితే ఆ లగేజ్ బ్యాగులో గుర్తుపట్టలేని వస్తువు వారికి కనిపించింది.ఇక ఆ వస్తువు ఏంటో తెలుసుకోవాలని వారంతా బ్యాగ్ ను చెక్ చేశారు.అందులో బతికి ఉన్నటువంటి ఓ కుక్కను చూసి ఆశ్చర్యపోయారు.

ప్రయాణికుడు చేసిన ఆ తప్పు ఇంకెవరూ చేయొద్దంటూ ఎయిర్ పోర్టు సిబ్బంది అందరినీ హెచ్చరించారు.ట్విట్టర్ ద్వారా ఈ సమాచారాన్ని అందరికీ తెలిపారు.

దయచేసి ప్రయాణికులు కుక్కలను తీసుకువస్తున్నట్లైతే ముందస్తు సమాచారాన్ని అందించాలని ఎయిర్ పోర్టు సిబ్బంది కోరారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube