వైరల్: చేపల కోసం వల వేశారు... పాములు వచ్చాయ్!

అనుకున్నదొకటి.అయినదొక్కటి.

ఇలా చాలా మంది జీవితంలో ఒక వస్తువు కావాలని వెళితే.మరో వస్తువు దొరికే సంఘటనలు ఎదురయ్యే ఉంటాయి.

ఒకదానిని వేటాడితే.దాని స్థానంలో మరొకటి వెంటాడుతోంది.

ఇలాగే ఓ వ్యక్తి పొట్టకూటి కోసం వెళితే.ప్రాణం తీసే విషపూరిత జీవి చిక్కిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ సమీపంలోని పిపిలీ లో ఓ వ్యక్తి తన పొట్టకూటి కోసం చేపలను పట్టడానికై నదికి వెళ్లాడు.దీంతో నదిలో వల వేసి చేపలు పడ్డాయని బయటకు తీయగా ఆ వలలో చేపలకు బదులు ఒకటి కాకుండా ఏకంగా రెండు పాములు చిక్కాయి.

అది చూసిన ఆ వ్యక్తి ఆశ్చర్యంతో భయాందోళనకు గురి అయ్యాడు.దీంతో వలలో చిక్కుకున్న పాములను ఏమి చేయాలో తోచక వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ కు సమాచారాన్ని అందించాడు.

దీంతో అక్కడికి చేరుకున్న అతను ఆ వలలో చిక్కుకున్న పాములను తీసి జాగ్రత్తగా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలి వేశారు.కాగా ఆ పాములలో ఒకటి విషపూరితం కాగా, మరో పాము నుండి ఎలాంటి విషపూరితం లేదని తెలిపారు.

కాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తీయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కాబట్టి వేటకు వెళ్లేవాళ్లు, మత్స్యకారులు ( చేపలు పట్టే వాళ్ళు) వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

ఇటువంటి సంఘటనలు ఎదురైతే ప్రాణాలకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని సందర్భాలలో హెల్ప్ లైన్ కు సమాచారాన్ని అందించి తమ వద్ద నుండి సహాయం తీసుకోవాలి.

Advertisement

అంతేకాకుండా వేటకి వెళ్లేటప్పుడు ఒంటరిగా కాకుండా తోడుగా మరో ఇద్దరు వ్యక్తులను తీసుకు వెళ్ళాలి.

తాజా వార్తలు