ఫస్ట్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా.. ఆ తర్వాత బుచ్చిబాబుతో?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది.

దీంతో దర్శక నిర్మాతలు అలాగే హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయాలని ఆసక్తిని కనబరుస్తున్నారు.

మరి ముఖ్యంగా స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలో నటించి గుర్తింపు సంపాదించుకోవాలి అని చూస్తున్నారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో విడుదల అవుతున్న సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

ఆర్ఆర్ఆర్, పుష్ప, గాడ్ ఫాదర్, రాధే శ్యామ్ ఈ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో విడుదల అయ్యి మంచి కలెక్షన్లను సాధించాయి.దీంతో హీరో స్టార్ హీరోలు అందరూ కూడా ఈ పాన్ ఇండియా జాడలోనే నడుస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాలు చేయాలి అని తహతహలాడుతున్నారు.ఆ హీరోల లిస్టులోకి మన జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరారు.

Advertisement

పాన్ ఇండియా సినిమాలలో నటించడం కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈపాటికి బుచ్చిబాబుతో సినిమా ప్రారంభించాల్సి ఉంది.

కానీ ఆ ప్రాజెక్టు అంతకంతకు ఆలస్యం అవుతూనే వస్తోంది.

అందుకు గల కారణం ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ సినిమాల విషయంలో కథను ఆచి చూసి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.కానీ ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్,కొరటాల శివకు అలాగే బుచ్చిబాబుకు కమిట్మెంట్లు ఇచ్చేశాడు.ఇది ఇలా ఉంటే మరొకవైపు మైత్రి మూవీ మేకర్ సంస్థ దర్శకుడు ప్రశాంతి నీల్ ని లైన్ లో పెట్టి జూనియర్ ఎన్టీఆర్ పై ప్రెజర్ తెస్తోందట.

ఇక ఎన్టీఆర్ కూడా ప్రశాంత్ నీల్ తో సినిమాను చేయాలి అని అనుకుంటున్నాడట.కానీ అంతకంటె ముందు కొరటాల దర్శకత్వంలో సినిమాను పూర్తి చేసిన తర్వాత ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి సినిమాను చేయబోతున్నారు ఎన్టీఆర్.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

ఆ తర్వాతనే బుచ్చిబాబుకు ఛాన్స్ ఉంటుంది అంటూ ఊహగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు