'పుష్ప 2' నుండి బిగ్గెస్ట్ ట్రీట్.. ఫహద్ ఫాజిల్ స్టైలిష్ పోస్టర్ రిలీజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప ది రూల్.

ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇస్తున్న అప్డేట్ లతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు.

ఇప్పటికే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసారు.

వీటికి ఆడియెన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.దీంతో సౌత్ కంటే కూడా నార్త్ ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఈ సినిమా ఎదురు చూస్తున్నారు.అందుకే సుకుమార్ కూడా ఎక్కడ అంచనాలు తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు.

ప్రజెంట్ ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.మంచి హైప్ పెంచేసుకున్న ఈ సినిమా నుండి ఇప్పుడు క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

Advertisement

ఈ సినిమా పార్ట్ 1 లో భన్వర్ సింగ్ షెకావత్ రోల్ లో ఫహద్ ఫాజిల్ ( Fahadh Faasil ) నటించిన విషయం విదితమే.ఈయన తన నటనతో అందరిని ఆకట్టు కున్నాడు.

ఇక సెకండ్ పార్ట్ లో కూడా ఈయన తన నటనతో అలరిస్తాడు అనే వార్తలు వస్తున్నాయి.మరి నేడు ఆయన పుట్టిన రోజు కావడంతో అదిరిపోయే పోస్టర్ ను మేకర్స్ అఫిషియల్ గా రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ లో ఫహద్ ఫాజిల్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసారు.ఇక రష్మిక మందన్న( Rashmika Mandanna ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాల్సిందే.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు