లాంఛనాలు పూర్తి .. ఇజ్రాయెల్ చేరుకున్న భారత కార్మికులు, 60 మందితో ఫస్ట్ బ్యాచ్

ప్రస్తుతం హమాస్ ఉగ్రవాద సంస్థతో ఇజ్రాయెల్ యుద్ధం ( Israel’s war )చేస్తున్న సంగతి తెలిసిందే.ఎట్టి పరిస్ధితుల్లోనూ హమాస్‌ను నాశనం చేయాలనే కృత నిశ్చయంతో వున్న ఇజ్రాయెల్ గాజాను దిగ్భంధించింది.

 First Batch Workers From India Under G2g Agreement Arrives In Israel , Israel ,-TeluguStop.com

గాజాకు రాకపోకలను పూర్తిగా నిలిపివేసింది.అయితే ఈ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌ను కార్మికుల కొరత వేధిస్తోంది.

యుద్ధానికి ముందు గాజా నుంచి ఇజ్రాయెల్‌లో భవన నిర్మాణం, ఇతర పనుల ద్వారా దాదాపు 80 వేల మంది వెస్ట్‌బ్యాంక్‌కు చెందిన పాలస్తీనియన్లు , గాజాకు చెందిన 17 వేల మంది ఉపాధి పొందేవారు.ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఇజ్రాయెల్ కమ్మేయడంతో వారికి ఉపాధి కరువైంది.

మరోవైపు.ఇజ్రాయెల్‌కు వర్క్ ఫోర్స్‌ను ఎలా భర్తీ చేయాలనేది నెతన్యాహూ( Netanyahu ) ప్రభుత్వానికి తలనొప్పులు తీసుకొచ్చింది.ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ ప్రభుత్వానికి భారత్ అండగా నిలిచింది.గతేడాది డిసెంబర్‌లో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ.

ప్రధాని నరేంద్ర మోడీతో ( Prime Minister Narendra Modi )టెలిఫోన్ సంభాషణ జరిపారు.వీరిద్దరి భేటీలో భారత్ నుంచి కార్మికుల రాక అంశం చర్చకు వచ్చింది.

మనదేశానికి చెందిన దాదాపు 10 వేల మంది కార్మికులను యూదు దేశానికి పంపేందుకు న్యూఢిల్లీ ఓకే చెప్పింది.

Telugu Batchindia, Gg, India, Israel, Netanyahu, Palestinians, Primenarendra, Ga

ఒప్పందం మేరకు భారతదేశం నుంచి 60 మంది కార్మికులతో కూడిన ఫస్ట్ బ్యాచ్ ఇజ్రాయెల్ చేరుకుంది.జీ2జీ మెకానిజం( G2G mechanism ) మధ్యవర్తులను దూరంగా ఉంచడానికి , ఇజ్రాయెల్ ఎగ్జామినర్లు నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల ద్వారా నియామక ప్రక్రియను సజావుగా చేయడానికి రూపొందించబడింది.వారు పలుమార్లు భారత్‌ను సందర్శించి, భారత ప్రభుత్వ సంస్థలతో ఈ ప్రక్రియను సమన్వయం చేశారు.

భారత నిర్మాణ కార్మికుల తొలి బ్యాచ్ మంగళవారం సాయంత్రానికి ఇజ్రాయెల్ చేరుకుంది.గతంలో బీ2బీ మార్గం ద్వారా కొన్ని నెలలుగా భారత్ నుంచి 900కు పైగా నిర్మాణ కార్మికులు ఇజ్రాయెల్ చేరుకున్నారు.

ఇందులో ఇరు దేశాల్లోని మ్యాన్ పవర్ ఏజెన్సీలు పలు పాంచుకున్నాయి.

Telugu Batchindia, Gg, India, Israel, Netanyahu, Palestinians, Primenarendra, Ga

ఇజ్రాయెల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల ద్వారా నిర్మాణ రంగంలో ఉద్యోగాల కోసం భారత్, శ్రీలంకల నుంచి 20 వేల మందికి పైగా విదేశీ కార్మికులకు అనుమతి లభించింది.దాదాపు 3 నెలల తర్వాత కేవలం 1000 మంది కార్మికులు మాత్రమే ఇక్కడికి చేరుకున్నారని నిర్మాణ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.ఈ జాప్యానికి వివిధ అనుమతులు, బ్యూరోక్రాటిక్ విధానాలు కారణమని వారు ఆరోపించారు.

ఎంపికైన ఎంతోమంది కార్మికులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఇజ్రాయెల్‌లో పనిచేయడానికి వీసా కోసం వేచి చూస్తున్నారని వారు వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube