టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని( Perni Nani ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు దొంగ నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు.
గతంలో రుణమాఫీ చేస్తామని చంద్రబాబు ఎగ్గొట్టారన్న పేర్ని నాని మళ్లీ చంద్రబాబుకు ( Chandrababu )ఇప్పుడు పేదలు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు.గతంలో పసుపు, కుంకుమ పేరుతో టీడీపీ డబ్బులు పంచినా తాము ఈసీకి ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
అంతేకాకుండా జన్మభూమి కమిటీల ద్వారా టీడీపీ( TDP ) కార్యకర్తలకు డబ్బులు పంచుకున్నారని ఆరోపించారు.గతంలో టీడీపీ పథకాలను తాము ఎప్పుడైనా అడ్డుకున్నామా అని నిలదీశారు.
చంద్రబాబు కుట్ర కారణంగా పెన్షనర్లు ఎండలో రోడ్లపై పడిగాపులు పడుతున్నారని తెలిపారు.పెన్షన్లను ఒకటో తేదీన ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.
వాలంటీర్లు పెన్షన్ అందించినంత మాత్రాన ఓటు వేస్తారా అని ప్రశ్నించారు.అదేవిధంగా మొన్నటిదాకా తాము ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించిన విపక్ష నేతలు ఇప్పుడు లక్షా 60 వేల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారని అంటున్నారని తెలిపారు.
తాము ఉద్యోగాలు ఇవ్వకపోతే సచివాలయ ఉద్యోగులంతా ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.