అమెరికాలో ఓ సంస్థపై గర్భిణి ఫిర్యాదు...?

అమెరికాలో ఓ సంస్థ తన సంస్థలో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగినికి షాక్ ఇచ్చింది.ఆమెని ఉద్యోగం నుంచీ తీస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

అయితే ఉద్యోగం పోగొట్టుకున్న ఆమె ఆ సంస్థకి కూడా దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది.దాంతో ఇప్పుడు సదరు సంస్థ ఆ మహిళా ఇచ్చిన షాక్ తో తల పట్టుకుంటోంది.

న్యూజెర్సీని కుంబర్ ల్యాండ్ కౌంటీ లో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలలోకి వెళ్తే సౌత్ జెర్సీ ఎక్స్‌టెండెడ్ కేర్ సెంటర్‌ ఉద్యోగి తైషన్ జే స్మిత్ ని 2017 జులై 25న ఉద్యోగం నుంచీ ఆ సంస్థ తొలిగించింది.

దాంతో సదరు మహిళా రాష్ట్ర అటార్నీ జనరల్ గుర్బీర్ గ్రేవాల్ కి ఫిర్యాదు చేసింది.

Advertisement

సహజంగా కంటే కూడా గర్భిణిగా తనకి మరిన్ని హక్కులు ఉంటాయని వాటిని హరించడం ఎంతవరకూ సమజసం , నా హక్కులని కాలరాశారు అంటూ ఫిర్యాదు చేయడంతో.సదరు సంస్థపై అటార్నీ జనరల్ దర్యాప్తు చేపట్టామని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.ఈ పరిస్థితులతో సదరు సంస్థ తల పట్టుకుంది.

ఆ మహిలని ఉద్యోగం నుంచీ తీసేయడంలో సరైన వివరాలు చెప్పక పొతే సంస్థపై చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు